Sai Tej | స్టెరాయిడ్స్ తీసుకోవడం వళ్ల ఇంకా కోలుకోలేదు.. సాయిధరమ్ షాకింగ్ కామెంట్స్
Sai Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బెస్ట్ ట్రీట్‌మెంట్ అందించడంతో క్రమంగా కోలుకున్న తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తేజ్ చివరిగా నటించిన విరూపాక్ష చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకి బుల్లితెరపై కూడా మంచి ఆదరణ దక్కింది. ఇక రీసెంట్‌గా తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే […]

Sai Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో గాయపడి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. బెస్ట్ ట్రీట్‌మెంట్ అందించడంతో క్రమంగా కోలుకున్న తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తేజ్ చివరిగా నటించిన విరూపాక్ష చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకి బుల్లితెరపై కూడా మంచి ఆదరణ దక్కింది. ఇక రీసెంట్‌గా తన మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమా చేశాడు. జూలై 28న ఈ చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీ ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు.
మరోవైపు మూవీకి సంబంధించి పాటలని ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ మునపటిలా అంత గ్రేస్‌తో డ్యాన్స్ వేస్తున్నట్టు కనిపించడం లేదు. దీంతో కొందరు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. పునర్జన్మ పొందిన తాను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నప్పటికీ మెడిసిన్స్ పెద్ద మొత్తంలో వాడడం వలన బాడీలో చిన్న చిన్న సమస్యలు ఇంకా ఉన్నాయని అన్నాడు. కోమాలో ఉన్నప్పుడు నాకు ఎక్కువగా స్టెరాయిడ్స్ ఇచ్చారు. అవి నా బాడీపై తీవ్రమైన ప్రభావం చూపాయి. ఫిజికల్ ఫిట్ నెస్ కూడా కోల్పోయాను. ఇప్పుడు తిరిగి పొందాలి. అందుకే ఎక్కువగా కష్టపడుతున్నాను.
నా డ్యాన్సులు చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు నేను కూడా చాలా నిరాశ చెందాను. ప్రమాదం తర్వాత నేను కోలుకున్నా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పడ్డాయి. అయితే వాటిని నేను సాకుగా చూపను. ఫ్యాన్స్ కోరుకునే విధంగా మునుపటికంటే ఎక్కువగా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాను. దానికి తప్పకుండా కొంత సమయం పడుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం నా నోట మాట రాలేదు. ఇప్పుడు దానిని అధిగమించి మంచిగానే మాట్లాడగలుగుతున్నాననని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ కి ముందు తాను 6 నెలలు బ్రేక్ తీసుకుని బాడీ ఫిట్ నెస్, ఇతర సమస్యలపై ఫోకస్ పెట్టబోతున్నట్లు వివరించాడు.