Samantha: చల్లని నీటిలో సమంత సాహసం.. మరీ ఇంత మొండిదా?
Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే కెరీర్ పరంగా బాగానే దూసుకుపోతున్న సమంత ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడుతుంది. నిత్యం వ్యాయామం, యోగా చేయడం అలానే ఇంటి ఆవరణలో స్వయంగా కూరగాయలు, పండ్లు సాగు చేసి వాటిని తిన్నా కూడా సమంతని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడు […]

Samantha: టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అయితే కెరీర్ పరంగా బాగానే దూసుకుపోతున్న సమంత ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు పడుతుంది. నిత్యం వ్యాయామం, యోగా చేయడం అలానే ఇంటి ఆవరణలో స్వయంగా కూరగాయలు, పండ్లు సాగు చేసి వాటిని తిన్నా కూడా సమంతని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇప్పుడు ఆ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చినట్టు చెప్పిన సమంత.. ప్రస్తుతం విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.
అక్కడ తను చేసే హడావిడికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తోంది. దీవుల దేశం ఇండోనేషియాలో పర్యటిస్తూ.. తన ఖాళీ సమయాన్ని మానసిక ప్రశాంతత కోసం గడుపుతుంది. బాలీ ద్వీపంలో ఏరియల్ యోగ చేసినట్టు కూడా చెప్పుకొచ్చింది. ఇక తాజాగా నాలుగు డిగ్రీల చల్లని నీళ్ల తొట్టిలో ఆరు నిమిషాల పాటు ఉన్నట్టు చెప్పుకొచ్చింది సమంత. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియోని షేర్ చేస్తూ ఇలాంటి సాహసం చేసానని పేర్కొంది. అంతటి చల్లని నీళ్లలో అంత సేపు గడపడం ఆషామాషీ కాదు. శరీరం చాలా బాధకు గురైన కూడా మొండిదైన సమంత ఆ సాహసం పూర్తి చేసింది.
అయితే మయోసైటిస్‌కి ఇది కూడాడా ఒక విధమైన ట్రీట్మెంట్ అట. చల్లని నీళ్లల్లో కొన్ని నిమిషాలు అలా స్నానం చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. ఏడాది పాటు పూర్తిగా సినిమాలకి దూరంగా ఉంటూ తన ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెడుతుంది. సెప్టెంబర్ 1న సమంత నటించిన ఖుషీ సినిమా విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొననుంది సమంత. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా త్వరలో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతుంది. ఈ యాక్షన్ సిరీస్ లో సమంతతో పాటు వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేయగా, అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమ్ కానుంది.