Samantha | సిటడెల్‌ సిరీస్‌ కోసం సమంత రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?

Samantha | టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత బాలీవుడ్‌లో సిటడెల్‌ సిరీస్‌లో నటిస్తున్నది. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీబిజీగా గడపుతున్నది. సిటడెల్‌లో హీరోగా వరుణ్‌ ధావన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బృందం ఇటీవల ఇండియాలో షూటింగ్‌ పూర్తి చేసుకొని.. విదేశాలకు వెళ్లింది. ప్రస్తుతం షూటింగ్‌ సెర్బియాలో షూటింగ్‌ జరుపుకుంటున్నది. సిటడెల్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ కాగా.. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మాడెన్‌ నటించారు. ఇండియన్‌ వర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం సమంత గురించి […]

Samantha | సిటడెల్‌ సిరీస్‌ కోసం సమంత రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?

Samantha | టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత బాలీవుడ్‌లో సిటడెల్‌ సిరీస్‌లో నటిస్తున్నది. ప్రస్తుతం షూటింగ్‌లో బిజీబిజీగా గడపుతున్నది. సిటడెల్‌లో హీరోగా వరుణ్‌ ధావన్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం బృందం ఇటీవల ఇండియాలో షూటింగ్‌ పూర్తి చేసుకొని.. విదేశాలకు వెళ్లింది.

ప్రస్తుతం షూటింగ్‌ సెర్బియాలో షూటింగ్‌ జరుపుకుంటున్నది. సిటడెల్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌ కాగా.. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మాడెన్‌ నటించారు. ఇండియన్‌ వర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ కనిపించనున్నారు. ప్రస్తుతం సమంత గురించి మరో వార్త బయటకు వచ్చింది. ఈ సిరీస్‌ కోసం బ్యూటీ భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం రూ.4కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు తీసుకుంటుండగా.. సిటడెల్‌ సిరీస్‌కు రూ.10కోట్లు వసూలు చేస్తున్నట్లు టాక్‌. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ స్థాయిలో సమంత పారితోషకం తీసుకుంటున్నది. ప్రస్తుతం అలియా భట్‌, దీపికా పదుకొణె, కంగనా రనౌత్‌ వంటి బాలీవుడ్‌ నటీమణులు రూ.8కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు రెమ్యురేషన్‌ తీసుకుంటుండగా.. అదే స్థాయిలో ఇప్పుడు సమంత సైతం రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నది.

ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్‌ విజయంకావడంతో.. సిటడెల్‌ సిరీస్‌ కోసం రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. సమంత తెలుగులో ‘ఖుషీ’ సినిమాలో నటిస్తున్నది. ఇందులో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలకానున్నది.