Minister Srinivas Goud | మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 4.20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారి డివైడర్ వద్ద శనివారం మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్బంగా మంత్రి సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ కోటి వృక్షార్జన కార్యక్రమంలో […]

  • By: Somu    latest    Aug 26, 2023 11:31 AM IST
Minister Srinivas Goud | మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 4.20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని బైపాస్ రహదారి డివైడర్ వద్ద శనివారం మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని ఈ సందర్బంగా మంత్రి సూచించారు.

మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లాలో ఉధృతంగా చేపడతామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ జీ రవి నాయక్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, అదనపు కలెక్టర్లు మోహన్ రావు, యాదయ్య, జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.