Mumbai Murder Case | సరస్వతిది ఆత్మహత్యే.. ఆ భయంతోనే ముక్కలు ముక్కలుగా నరికేశాను
Mumbai Murder Case | ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ముంబైలోని మీరా రోడ్‌లో సహజీవన భాగస్వామిని హత్య చేసిన కేసులో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి వైద్యను తాను హత్య చేయలేదని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు మనోజ్ సానీ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ కేసులో ఇరుక్కుంటాననే భయంతోనే ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించినట్లు సానీ తెలిపినట్లు తెలుస్తోంది. శ్రద్ధా […]

Mumbai Murder Case | ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే ముంబైలోని మీరా రోడ్‌లో సహజీవన భాగస్వామిని హత్య చేసిన కేసులో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరస్వతి వైద్యను తాను హత్య చేయలేదని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిందితుడు మనోజ్ సానీ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
అయితే ఈ కేసులో ఇరుక్కుంటాననే భయంతోనే ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించినట్లు సానీ తెలిపినట్లు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్ ఘటనను చూసే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెల్లడిస్తున్నాయి.
నేను హెచ్ఐవీ బాధితుడిని.. సరస్వతితో సహజీవనంలో లేను..
తాను హెచ్ఐవీ బాధితుడినని, చాలా ఏండ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు మనోజ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే సరస్వతి తనకు కూతురు లాంటిదని, ఆమెతో సహజీవనంలో లేను అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఆమె టెన్త్ ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంది. అందుకోసం తాను మ్యాథ్స్ చెప్పేవాడని. ఇక సరస్వతి చాలా సంకుచితంగా ఉండేదని, ఆలస్యంగా ఇంటికి వస్తే అనుమానించేది అని పోలీసుల విచారణలో మనోజ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను..
జూన్ 3వ తేదీన రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి సరస్వతి ఆత్మహత్య చేసుకుంది. ఇక తాను ఈ కేసులో ఇరుక్కుపోతానేమోనన్న భయంతో మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాను. శ్రద్ధా వాకర్ హత్య కేసు గుర్తుకు రావడంతో.. ఆ మాదిరిగానే శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేశాను. కుక్కర్‌లో ఉడికించాను. కొన్ని శరీర భాగాలను మిక్సి చేసి మాయం చేయాలనుకున్నానని పోలీసుల విచారణలో మనోజ్ అంగీకరించినట్లు సమాచారం. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపినట్లు సమాచారం.
పరిచయం ఇలా..
సరస్వతి వైద్య, మనోజ్ సానీ తొలిసారిగా రేషన్ షాపులో కలుసుకున్నారు. ఐటీఐ చేసిన మనోజ్‌కు సరైన ఉద్యోగం లభించలేదు. దీంతో గత పదేండ్ల నుంచి రేషన్ షాపులో పని చేస్తున్నాడు. అనాథ అయిన సరస్వతి వైద్య.. మనోజ్‌కు రేషన్ దుకాణంలోనే పరియమైంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ దగ్గరయ్యారు. గత మూడేండ్ల నుంచి మీరా రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు.