Satyapal Malik | భారత సైనికుల శవాలపైనే.. 2019 లోక్‌సభ ఎన్నికలు: సత్యపాల్ మాలిక్
Satyapal Malik | పూల్వామ దాడిపై మళ్లీ విచారణ జరిపించాలి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ రాజీనామా చేయాలి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ డిమాండ్ విధాత: పల్వామా దాడి ఘటన అంశంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik). 'మా సైనికుల శవాలపైనే 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి' అని మండిపడ్డారు. పుల్వామా దాడి (Pulwama attack) ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని, కేంద్ర హోంమంత్రి […]

Satyapal Malik |
- పూల్వామ దాడిపై మళ్లీ విచారణ జరిపించాలి
- కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ రాజీనామా చేయాలి
- జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ డిమాండ్
విధాత: పల్వామా దాడి ఘటన అంశంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik). ‘మా సైనికుల శవాలపైనే 2019 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి’ అని మండిపడ్డారు.
పుల్వామా దాడి (Pulwama attack) ఘటనపై మరోసారి విచారణ జరిపించాలని, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్ర దాడి జరిగిన వెంటనే తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి సమాచారం అందించాలని, కానీ, ఆయన తనను నోరు మెదపవద్దని (కీప్ క్వైట్) ఆదేశించారని మాలిక్ తెలిపారు.
‘2019 లోక్‌సభ ఎన్నికలు మా సైనికుల శవాలపై జరిగాయి. కానీ, ఎలాంటి దర్యాప్తు జరుపలేదు. విచారణ జరిపితే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh) రాజీనామా చేయాల్సి ఉంటుంది. చాలా మంది జైలుకు వెళ్లి ఉండేవారు. పెద్ద వివాదం జరిగేది’ అని పేర్కొన్నారు. అల్వార్ జిల్లాలోని బన్సూర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాలిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను గవర్నర్‌గా నియామకం కాకముందు నుంచీ కూడా జమ్ముకశ్మీర్ అంశంలో మాలిక్ తన గళం విప్పుతూనే ఉన్నారు. పుల్వామా దాడి ఘటన జరిగిన 2019 ఫిబ్రవరి 14 నాడు ప్రధాన నరేంద్రమోదీ జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్ ఉన్నారని మాలిక్ తెలిపారు.
अगर 2024 में #नरेंद्र_मोदी को नहीं हटाया तो ये #डेमोक्रेसी को खत्म कर देगा, चुनाव ही नहीं होगा फिर।
मैं देश के लोगों को कहना चाहता हूं कि आखिरी मौका है ये इस बार #जाति #धर्म सब छोड़कर इनके खिलाफ वोट करो वरना आगे आपको वोट का भी मौका नहीं मिलेगा- #सत्यपाल_मलिक (पूर्व गवर्नर) pic.twitter.com/B26R5xAO5JALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!— Satyapal Malik