SBI Loan Offer | సొంతింటి కోసం హోంలోన్‌ తీసుకోవాలనుకునేవారికి ఎస్‌బీఐ సూపర్‌ ఆఫర్‌..!

SBI Loan Offer | పండుగల సీజన్‌ మొదలైంది. ఈ క్రమంలో చాలా మంది ఈ పండుగల సమయంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఇందు కోసం లోన్‌ తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే, లోన్‌ తీసుకునేవారి కోసం ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. సిబిల్‌ స్కోర్‌ బాగున్న కస్టమర్లకు ఎస్‌బీఐ 65 బేసిక్‌ పాయింట్ల వరకు వడ్డీ రేటుపై డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నది. ఈ ఆఫర్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనున్నది. ఆర్థిక […]

SBI Loan Offer | సొంతింటి కోసం హోంలోన్‌ తీసుకోవాలనుకునేవారికి ఎస్‌బీఐ సూపర్‌ ఆఫర్‌..!

SBI Loan Offer | పండుగల సీజన్‌ మొదలైంది. ఈ క్రమంలో చాలా మంది ఈ పండుగల సమయంలో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. ఇందు కోసం లోన్‌ తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే, లోన్‌ తీసుకునేవారి కోసం ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. సిబిల్‌ స్కోర్‌ బాగున్న కస్టమర్లకు ఎస్‌బీఐ 65 బేసిక్‌ పాయింట్ల వరకు వడ్డీ రేటుపై డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నది. ఈ ఆఫర్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉండనున్నది. ఆర్థిక క్రమశిక్షణ, రుణాల చెల్లింపు, క్రెడిట్‌కార్డుల వినియోగం, క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపులు, చెక్‌బౌన్స్‌లు లేకపోవడం వంటి వాటి ఆధారంగా సిబిల్‌ స్కోర్‌ లభిస్తున్నది.

ప్రస్తుతం అన్ని బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు సిబిల్‌ స్కోర్‌ ఆధారంగానే లోన్స్‌ ఇస్తున్నాయి. చివరకు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులు సైతం సిబిల్‌ స్కోర్‌ను బట్టి జారీ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ సైతం హోంలోన్స్‌పై డిస్కౌంట్‌ను ఇచ్చేందుకు సిబిల్‌ స్కోర్‌ను ఆధారంగా చేసుకుంటున్నది. సాధారణంగా సిబిల్‌ స్కోర్‌ 300-900 వరకు ఉంటుంది. సిబిల్ స్కోర్ 750 నుంచి 800 మధ్య ఉంటే గృహ రుణాల వడ్డీ రేటు లో 65 బేసిస్ పాయింట్ల వరకు డిస్కౌంట్ లభించనున్నది. ఈ డిస్కౌంట్ అనంతరం వడ్డీరేటు 8.6 శాతంగా ఉండనున్నది.

అలాగే సిబిల్‌ 700 -749 మధ్య ఉంటే గృహ రుణాల వడ్డీరేటులో 55 బేసిస్ పాయింట్ల వరకు డిస్కౌంట్ లభించనున్నది. ఈ డిస్కౌంట్ అనంతరం వడ్డీరేటు 8.7శాతంగా నిర్ణయించింది. సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువ ఉంటే ఎలాంటి డిస్కౌంట్‌ ఆఫర్‌ ఇవ్వడం లేదు. వారికి 9.7శాతం వడ్డీ రేటు వర్తింపజేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. పూర్తి వివరాలు దగ్గరలో ఉన్న బ్రాంచ్‌లోనైనా.. లేదంటే వెబ్‌సైట్‌లోనైనా సంప్రదించాలని సూచించింది.