BRS | సిటింగ్‌లకే సీట్లు.. తొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల మార్పు

నాలుగు స్థానాల్లో పెండింగ్‌ BRS | విధాత : బీఆరెస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే బీఆరెస్ అభ్యర్థులకు సంబంధించి 119స్థానాలకుగాను 115స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఈ దఫా గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే సిటింగ్‌ అభ్యర్థులను మార్చారు. అయితే కోరుట్లలో సిటింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ కోరిక మేరకు ఆయన కుమారుడు సంజయ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని కేసీఆర్ […]

  • By: Somu    latest    Aug 21, 2023 11:33 AM IST
BRS | సిటింగ్‌లకే సీట్లు.. తొమ్మిది స్థానాల్లో అభ్యర్థుల మార్పు
  • నాలుగు స్థానాల్లో పెండింగ్‌

BRS | విధాత : బీఆరెస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలపడే బీఆరెస్ అభ్యర్థులకు సంబంధించి 119స్థానాలకుగాను 115స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఈ దఫా గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే సిటింగ్‌ అభ్యర్థులను మార్చారు. అయితే కోరుట్లలో సిటింగ్ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ కోరిక మేరకు ఆయన కుమారుడు సంజయ్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని కేసీఆర్ తెలిపారు. అలాగే కంటోన్మెంట్ లో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

సిటింగ్ అభ్యర్థులను మార్చిన ఏడు స్థానాల్లో స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి, వైరాలో బాణోతు మదన్‌లాల్ నాయక్, అసిఫాబాద్ లో కోవ లక్ష్మి, బోథ్‌లో అనిల్ జాదవ్‌, ఖనాపూర్‌లో భూక్యా జాన్సన్ నాయక్‌, వేములవాడలో చల్మెడ లక్ష్మినరసింహరావు, ఉప్పల్‌లో బండారు లక్ష్మారెడ్డిలను అభ్యర్థులుగా ఖరారు చేశారు. హుజురాబాద్ అభ్యర్ధిగా పాడి కౌశిక్‌రెడ్డిని, దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. నర్సాపూర్‌, జనగామ, నాంపల్లి, గోషామాహల్ అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టారు.