అదానీ గ్రూప్‌కు ఎదురుదెబ్బ
-హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు జరపాలంటూ వేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ విధాత: హిండెన్ బర్గ్ రిసెర్చ్ నివేదికపై దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు గురువారం అంగీకరించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ, దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటుచేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలంటూ న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనున్నది. గౌతమ్ […]

-హిండెన్ బర్గ్ నివేదికపై దర్యాప్తు జరపాలంటూ వేసిన పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ
విధాత: హిండెన్ బర్గ్ రిసెర్చ్ నివేదికపై దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు గురువారం అంగీకరించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ, దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటుచేసేలా కేంద్ర ప్రభుత్వానికి సూచించాలంటూ న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనున్నది.
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సంస్థల్లో అవకతవకలు జరిగాయని, దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ కంపెనీల షేర్ల విలువ 85 శాతం బూటకమని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ గత నెల 24న ఓ సంచలన రిపోర్టును విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ కుప్పకూలింది. కేవలం వారం రోజుల్లో రూ.10 లక్షల కోట్ల మదుపరుల సంపద కరిగిపోయింది.
ఈ అంశంపై ఇప్పటికే పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నది. ప్రతిపక్షాలన్నీ అదానీ వ్యవహారంలో మోదీ సర్కారు తీరును ఎండగడుతున్నాయి. దీనిపై చర్చకు పట్టుబడుతున్నదీ విదితమే. ఈ క్రమంలోనే అత్యవసర విచారణను కోరుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు తివారీ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు.
బడా కార్పొరేట్ల రుణాలపై
బడా కార్పొరేట్లకు రూ.500 కోట్లకుపైగా విలువైన రుణాలన్నీ ఏ ప్రాతిపదికన మంజూరవుతున్నాయో తెలుసుకునేలా ఓ ప్రత్యేక కమిటీ నియామకానికీ ఆదేశాలివ్వాలంటూ ఈ పిల్‌లో సుప్రీంను తివారీ అభ్యర్థించారు.
కాగా, గత వారం న్యాయవాది ఎంఎల్ శర్మ సైతం సుప్రీం కోర్టులో ఓ పిల్‌ను దాఖలు చేసినది తెలిసిందే. హిండెన్ బర్గ్ అధినేత నాథన్ అండర్స్‌న్, భారత్‌లో ఆయన అనుచరులపై విచారణను కోరుతూ ఇది దాఖలైంది. అమాయక మదుపరులను ఆందోళనకు గురిచేయడం, కృత్రిమంగా అదానీ గ్రూప్ షేర్ల విలువను తగ్గించేలా చేశారన్న అభియోగాలను శర్మ ఇందులో మోపారు.