BRS కు షాక్.. కాంగ్రెస్‌లోకి MLC కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి!
BRS విలువలు లేని చోట ఉండనంటూ ప్రకటన విధాత: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఫ్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనంటు వ్యాఖ్యానించిన కూచుకుళ్ల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్గుగా తెలిపారు. ఆదివారం ఉదయం డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌కు తన రాజీనామా అంశాన్ని వెల్లడించారు. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. గత ఎన్నికలకు ముందు […]

BRS
- విలువలు లేని చోట ఉండనంటూ ప్రకటన
విధాత: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఫ్రకటించారు. విలువలు లేని చోట తాను ఉండలేనంటు వ్యాఖ్యానించిన కూచుకుళ్ల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్గుగా తెలిపారు.
ఆదివారం ఉదయం డీసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన బీఆర్‌ఎస్‌కు తన రాజీనామా అంశాన్ని వెల్లడించారు. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లుగా సమాచారం. గత ఎన్నికలకు ముందు తనను సంప్రదించకుండా నాగం జనార్ధన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పట్ల అసంతృప్తితో దామోదర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఆ పార్టీలో చేరాక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డితో ఆయనకు పొసగలేదు. ఈ పరిస్థితులను ఆసరగా చేసుకుని టీ.కాంగ్రెస్ నాయకత్వం ఘర్ వాపసీలో భాగంగా దామోదర్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి ఆయన మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.
అలాగే తన కుమారుడు రాజేష్‌రెడ్డి రాజకీయ భవితవ్యం కోసం కూడా దామోదర్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరడానికి కారణంగా భావిస్తున్నారు. ఈ నెల 20న కొల్లాపూర్ కాంగ్రెస్ సభలో కుమారుడి తో పాటు దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
నాగర్ కర్నూల్ రాజకీయాల్లో గతంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న దామోదర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతుంది.
బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గుడ్ బై
బీఆర్‌ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన దామోదర్ రెడ్డి.
ఈ నెల 20న కొల్లాపూర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న దామోదర్ రెడ్డి. pic.twitter.com/71HG98j9ua
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2023