Shocking Snake Video: వామ్మో పాము.. కొద్దిలో గులాబ్ జామ్‌లు గడగడలాడించిందిగా! (వీడియో) గుండె ధైర్యం ఉంటేనే చూడండి

విధాత : పాముల జాతులు రకరకాలు.. అందులో కొన్ని మెరుపు వేగంతో సర్రుమని పరుగెత్తేవి..మరికొన్ని నెమ్మదిగా కదిలేవి ఉంటాయి. అయితే.. మనకు ఎప్పుడైనా, ఎక్కడైనా పాములకు సంబంధించి మాటలు విన్నా, వాటిని చూసినా, ఆ పేరు విన్నా శరీరమంతా వణికిపోతోంది. ఒక్కక్కోసారి గుండె వేగం కూడా పెరిగిపోతోంది. శరీరమంతా చెమటలు వచ్చేస్తాయి. సహజంగా పాములంటేనే హడలెత్తిపోయే మనుషులు అవి మెరుపు వేగంతో మీదకొస్తే గుండె ఆగినంత పనే. ఆ పరిస్థితిలో భయానికే చచ్చే పరిస్థితి.
ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా మీకు అలాంటి అనుభవాలన్నింటినీ ఇస్తుంది. వీలైతే గుండె నిబ్బరం ఉన్న వాళ్లు మాత్రమే ఈ వీడియూ చూడడం బెటర్. లేకుంటే మీ గులాబ్ జాములు గలగలలాడుతాయనే అపే పదానికి అర్థం మీకు తెలిసి వస్తుంది. తర్వాత మీరూ అదే మాట అంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. సరిగ్గా ఇలాంటి ప్రమాదకర పరిస్థితినే ఓ వ్యక్తికి ఎదురైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ భారీ పాము ఓ ఇంటి ఆవరణలోని నీటి డ్రమ్ము కిందకు దూరింది. పామును గమనించిన ఇంటాయన ఓ పొడుగాటి కర్ర తీసుకుని దానిని బయటకు పంపించే ప్రయత్నం చేశాడు.
కర్ర తగలగానే ఆ పాము భయంతో ఒక్కసారిగా పారిపోయే క్రమంలో కళ్లు తెరిచి మూసే లోపల సెకన్ల వ్యవధిలో ఆ మనిషి వైపుకే సర్రున మెరుపు వేగంతో దూసుకొచ్చింది. అంతే ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చిన పామును చూసిన ఆ మనిషికి గుండె ఆగినంత పనైంది. భయంతో పాము నుంచి తప్పించుకునేందుకు ఇంట్లోకి పరిగెత్తాడు. పాపం ఆ పాముకు ఎటు పోవాలో తెలియక తప్పించుకునేందుకు ఇంటి ఆవరణలో అదే స్పీడులో మరో వైపు పరుగులు తీసి చివరకు వచ్చిన మార్గంలోనే పలాయనం చిత్తగించుకుంది. దీంతో ఆ ఇంటాయన హమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే.. అది నీటిలో నివసించే నీరుకంటి పాము అని.. సమీప డ్రైనేజీల నుంచి ఇంటి ఆవరణలోకి వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.