వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధికి దొహదపడాలి: CS సోమేశ్ కుమార్
విధాత: వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాల ద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని పెంపొందించే వివిధ కార్యక్రమాలపై సోమవారం BRKR భవన్‌లో సమావేశం జరిగింది. వివిధ శాఖలకు చెందిన దాదాపు 30 మంది ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు అందించారు. అందరి భాగ స్వామ్యంతో.. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ద్వారా అధిక వృద్ధి, ఉపాధి పెంపు కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులకు దోహదపడే విధానాలలో […]

విధాత: వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాల ద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని పెంపొందించే వివిధ కార్యక్రమాలపై సోమవారం BRKR భవన్‌లో సమావేశం జరిగింది. వివిధ శాఖలకు చెందిన దాదాపు 30 మంది ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు అందించారు. అందరి భాగ స్వామ్యంతో.. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ద్వారా అధిక వృద్ధి, ఉపాధి పెంపు కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు.
అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులకు దోహదపడే విధానాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. శాఖల పనితీరులో సమర్థతను పెంపొందిస్తే శాఖల పట్ల ప్రజల్లో ఉన్న దృక్పథంలో మార్పు వస్తుందన్నారు. అందరి భాగస్వామ్యం తోడైతే మార్పును త్వరితగతిన తీసుకొచ్చి అధిక ఉత్పాదకతను తీసుకురాగలుగుతామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలు అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయనన్నారు.
64% పెరిగిన పంటల విస్తీర్ణం
రాష్ట్ర వ్యవసాయ వృద్ధి ఎలా చేయవచ్చో తన ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడారు. వ్యవసాయ రంగంలోని సాగునీరు, విద్యుత్, సేకరణ, ఇన్‌పుట్ సరఫరా మరియు పెట్టుబడి మద్దతు వంటి విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు ఎంతో ప్రయోజనం పొందారన్నారు.
గత ఎనిమిదేళ్లలో పంటల విస్తీర్ణం 64% పెరగడమే అందుకు నిదర్శనమన్నారు. పంటల ఉత్పాదకతను ప్రోత్సహించడం, ఉద్యాన రంగం బలోపేతం, పంటకోత తర్వాత మెరుగైన నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ, పరిశోధన మరియు విస్తరణ వ్యవసాయ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడానికి కొన్ని వ్యూహాలని ఆయన తెలిపారు.
వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాల్లో మరింత ఉత్పాదకత మరియు అధిక వృద్ధిని సాధించడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం పై దృష్టి పెట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అధర్ సిన్హా, శాంతి కుమారి, అరవింద్ కుమార్, రామకృష్ణారావు, రాణి కుముదిని, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.