AICC కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌.. ఎలేటికి షోకాజ్‌ నోటీస్‌

జారీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం స్పంధించిన మహేశ్వర్‌రెడ్డి రేవంత్‌ నాపై కక్ష కట్టి నోటీస్‌ ఇప్పించాడు మోడీ, అమిత్‌షాలను కలిసిన వారికి ఎందుకు నోటీస్‌లు ఇవ్వలేదని ప్రశ్న నాకు జరిగిన అవమానాలపై ఖర్గే వద్ద తేల్చుకుంటా మహేశ్వర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడన్న రేవంత్‌ రెండు రోజుల క్రితమే మేం మాట్లాడుకున్నాం నోటీస్‌లు అంతర్గత వ్యవహారం విధాత: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ […]

  • By: krs    latest    Apr 12, 2023 6:22 AM IST
AICC కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌.. ఎలేటికి షోకాజ్‌ నోటీస్‌
  • జారీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం
  • స్పంధించిన మహేశ్వర్‌రెడ్డి
  • రేవంత్‌ నాపై కక్ష కట్టి నోటీస్‌ ఇప్పించాడు
  • మోడీ, అమిత్‌షాలను కలిసిన వారికి ఎందుకు నోటీస్‌లు ఇవ్వలేదని ప్రశ్న
  • నాకు జరిగిన అవమానాలపై ఖర్గే వద్ద తేల్చుకుంటా
  • మహేశ్వర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడన్న రేవంత్‌
  • రెండు రోజుల క్రితమే మేం మాట్లాడుకున్నాం
  • నోటీస్‌లు అంతర్గత వ్యవహారం

విధాత: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మాజీ మంత్రి చిన్నారెడ్డి గంట సేపట్లో ఈ నోటీస్‌పై స్పంధించి సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

ఈ మేరకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కార్యకర్తల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులు వచ్చాయని, అలాగే బీజేపీకి దగ్గర అవుతున్నాయని, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు ఈ నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ నోటీస్‌లకు గంట సేపట్లో సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో పార్టీ గైడ్‌లైన్స్‌ ప్రకారం తీవ్ర చర్యలుంటాయని ఈ నోటీస్‌లో తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ షోకాజ్‌ నోటీస్‌లు ఇవ్వడంపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రంగా స్పంధించారు. కాంగ్రెస్ కి తాను ఏం చేశానో రేవంత్ కి తెలియదన్నారు. తనపై రేవంత్ ఎందుకు కక్ష కట్టి నోటీసు ఇప్పించారో అర్థం కావడం లేదన్నారు. తొందర పడి తనకు నోటీసు ఇచ్చారన్నారు. నోటీస్‌లు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదన్నారు. తనకు నోటీసు ఇచ్చి అవమాన పరిచారన్నారు.

సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి నోటీసు ఇస్తారా? అని అడిగాడు. అమిత్ షా.. మోడీ లను కలిసిన వాళ్లకు ఎందుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్…రేవంత్ లు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విసువల్స్ కూడా సోషల్ మీడియా లో వచ్చాయని, మరి రేవంత్ కి నోటీసు ఇవ్వాలా..? అని అడిగాడు. తనకు జరిగిన అవమానాలపై ఖర్గే దగ్గర తేల్చుకుంటానన్నారు. ఇప్పటికే తాను ఖర్గే అపోయింట్మెంట్ అడిగానని అన్నారు.

మహేశ్వర్ రెడ్డి కామెంట్స్‌పై పై రేవంత్ రెడ్డి స్పంధించాడు. మహేశ్వర్ రెడ్డి నాకు మంచి మిత్రుడన్నారు. రెండు రోజుల క్రితం కూడా మేము మాట్లాడుకున్నామన్నారు. షోకాజ్ నోటీసు వ్యవహారం పార్టీ అంతర్గత అంశమన్నారు. ఆయనకు ఏవైనా అనుమానలు ఉంటే ఇంచార్జితో మాట్లాడొచ్చునన్నారు. క్రమశిక్షణ కమిటీ అనేది పార్టీ అంతర్గత అంశం అని తెలిపారు. వాళ్లే పార్టీకి సూచనలు చేస్తారన్నారు. నోటీసులపై అనుమానం ఉంటే.. ఇంచార్జిని అడిగితే నివృత్తి చేస్తారన్నారు.