Shruti Haasan | ‘వాల్తేరు వీరయ్య’ యూనిట్‌పై శృతిహాసన్ అసహనం.. అందుకే అలా చేసిందా?
Shruti Haasan| Waltair Veerayya విధాత: చాలా రోజుల తర్వాత గ్లామరస్ డాల్ శృతిహాసన్.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై స్పందించింది. రిలీజ్‌కు ముందు, తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు సంబంధించి శృతిహాసన్ ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి ప్రీ రిలీజ్ వేడుకకు వస్తానని చెప్పి కూడా రాకుండా.. అనారోగ్యం సాకు చెప్పింది. సాకు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఒక రోజు ముందు జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకకు శృతిహాసన్ హాజరైంది. ఆ వేడుకలో హడావుడి కూడా […]

Shruti Haasan| Waltair Veerayya
విధాత: చాలా రోజుల తర్వాత గ్లామరస్ డాల్ శృతిహాసన్.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై స్పందించింది. రిలీజ్‌కు ముందు, తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు సంబంధించి శృతిహాసన్ ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి ప్రీ రిలీజ్ వేడుకకు వస్తానని చెప్పి కూడా రాకుండా.. అనారోగ్యం సాకు చెప్పింది. సాకు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఒక రోజు ముందు జరిగిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకకు శృతిహాసన్ హాజరైంది. ఆ వేడుకలో హడావుడి కూడా చేసింది.
మరుసటి రోజు జరిగిన చిరంజీవి సినిమా ఫంక్షన్‌కు మాత్రం శృతిహాసన్ రాలేదు. ఆ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఒంగోలు ఫంక్షన్ తర్వాత అక్కడ హోటల్స్‌లో ఏం తిన్నదో ఏంటో.. ఆమెకి సుస్తి చేసిందట. అందుకే రాలేదు’ అంటూ సెటైరికల్‌గా శృతిపై చిరు కామెంట్స్ చేశారు. అయితే శృతిహాసన్ ఈ వేడుకకు, ‘వాల్తేరు వీరయ్య’ ఇతర ప్రమోషన్స్‌కు రాకపోవడానికి కారణం వేరే ఉంది. అదేంటో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె బయటపెట్టింది.
‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవి అవుతా’ అనే పాటను దట్టమైన మంచులో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం తెలుపుతూ అప్పట్లో చిరంజీవి ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. శృతిహాసన్‌పై పొగడ్తలు కూడా కురిపించారు. కానీ అదే శృతిని హర్ట్ చేసిందంట.
తాజాగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మంచులో ఆడటం (డ్యాన్స్ చేయడం) చాలా కష్టం. హీరోలు జాకెట్స్ వేస్తారు. కానీ మాకు జాకెట్, కోటు.. కనీసం శాలువ కూడా ఇవ్వరు. కేవలం శారీ, జాకెట్ వేసుకుని ఆ మంచులో డ్యాన్స్ చేయమంటారు.
Shes got a point