TSLPRB | ఏప్రిల్ 8, 9న SI, ASI తుది రాతపరీక్షలు.. హాల్ టికెట్‌పై ఫొటో తప్పనిసరి
విధాత: ఈ నెల 8, 9వ తేదీల్లో ఎస్‌సీటీ ఎస్ఐ, ఏఎస్ఐ, ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టులకు ఫైనల్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. […]

విధాత: ఈ నెల 8, 9వ తేదీల్లో ఎస్‌సీటీ ఎస్ఐ, ఏఎస్ఐ, ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టులకు ఫైనల్ రాత పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన విడుదల చేసింది.
ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సంబంధిత వెబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎస్‌సీటీ ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులకు 8వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఎస్‌సీటీ ఎస్ఐ(సివిల్) పోస్టులకు 9వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి అభ్యర్థి తమ పోటోను హాల్‌టికెట్‌పై అతికించాలని సూచించారు. కేవలం గమ్ మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. హాల్ టికెట్‌పై అభ్యర్థి ఒరిజినల్ పోటో లేనిచో పరీక్షకు అనుమతించబోమని చెప్పారు.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. మొబైల్స్, టాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ డివైజెస్, గడియారాలు, వాచ్ క్యాలికులేటర్స్, పర్సులు, వాలెట్‌లు తీసుకురావొద్దని సూచించారు. కేవలం బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేశారు.