విధి నిర్వహణలో ఈత రాదని మరిచి.. నదిలో దూకి SI మృతి

విధాత: అక్రమ సారా తయారీ దారులను పట్టుకొనే ప్రయత్నం ఓ పోలీస్‌ ప్రాణం తీసింది. సారా బట్టీలు నడుపుతున్న ముగ్గురిని పట్టుకొనే క్రమంలో నదిలో దూకిన పోలీసు ఈత రాక పోవటంతో ప్రాణాలు వదిలిన విషాద ఘటన ఇది. బిహార్‌ ముజఫర్‌ పూర్‌ జిల్లా ముషాహరి ప్రాంతం గూరీగందక్‌ నది పక్కన అక్రమంగా సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఓ పోలీస్‌ కానిస్టేబుల్ వారిని పట్టుకొనేందుకు వెళ్లాడు. పోలీసును చూసిన దుండగులు పోలీసుపై దాడి చేసి పక్కనే […]

  • By: krs    latest    Jan 18, 2023 1:20 PM IST
విధి నిర్వహణలో ఈత రాదని మరిచి.. నదిలో దూకి SI మృతి

విధాత: అక్రమ సారా తయారీ దారులను పట్టుకొనే ప్రయత్నం ఓ పోలీస్‌ ప్రాణం తీసింది. సారా బట్టీలు నడుపుతున్న ముగ్గురిని పట్టుకొనే క్రమంలో నదిలో దూకిన పోలీసు ఈత రాక పోవటంతో ప్రాణాలు వదిలిన విషాద ఘటన ఇది.

బిహార్‌ ముజఫర్‌ పూర్‌ జిల్లా ముషాహరి ప్రాంతం గూరీగందక్‌ నది పక్కన అక్రమంగా సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఓ పోలీస్‌ కానిస్టేబుల్ వారిని పట్టుకొనేందుకు వెళ్లాడు. పోలీసును చూసిన దుండగులు పోలీసుపై దాడి చేసి పక్కనే ఉన్న నదిలో దూకి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.

వారిని పట్టుకొనే ప్రయత్నంలో పోలీసు కూడా నదిలో దూకాడు. విధి నిర్వహణలో తనకు ఈత రాదన్న సంగతి మర్చిపోయిన పోలీసు నదిలో దూకి వారిని పట్టుకొనేందుకు ముందుకు పోయాడు. కానీ ఈదడం వచ్చిన అక్రమ సారా తయారీదారులు నదిని ఈదుతూ దాటి తప్పించుకోగా, పోలీసు మాత్రం ఈత రాక నదిలో మునిగి చనిపోయాడు.