Warangal | ఆకేరులోకి దూసుకెళ్ళిన ఎస్ఐ కారు
Warangal ప్రాణాలతో బయటపడిన వర్ధన్నపేట ఎస్ఐ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయనకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా ఆకేరు వాగులోకి కారు దూసుకెళ్లింది. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద శివారులో ఈ ఘటన జరిగింది. సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి ఎస్ఐ బయటపడ్డారు. ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. […]

Warangal
- ప్రాణాలతో బయటపడిన వర్ధన్నపేట ఎస్ఐ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయనకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం కారు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుండగా ఆకేరు వాగులోకి కారు దూసుకెళ్లింది.
వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద శివారులో ఈ ఘటన జరిగింది. సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం నుండి ఎస్ఐ బయటపడ్డారు. ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.