Karnataka | హస్తినకు చేరిన.. కర్ణాటక సీఎం అభ్యర్థి అంశం..!

అధిష్టామే తేల్చాలని ఏకవాక్య తీర్మానం పార్టీ సమావేశాలకు సంబంధించిన అన్నిప్రక్రియలు పూర్త‌యాయ్య‌న్న రణదీప్‌ ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఏకాభిప్రాయంతోనే సాధ్యమన్న ఖర్గే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఎవరిని ఇష్టపడుతున్నారు అనేది కాదు, ఎవరు కష్టపడుతున్నారనేదానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న డీకే Karnataka | కర్ణాటక సీఎం అభ్యర్థి అంశం హస్తినకు చేరింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనేది కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం సీటు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, […]

Karnataka | హస్తినకు చేరిన.. కర్ణాటక సీఎం అభ్యర్థి అంశం..!
  • అధిష్టామే తేల్చాలని ఏకవాక్య తీర్మానం
  • పార్టీ సమావేశాలకు సంబంధించిన అన్నిప్రక్రియలు పూర్త‌యాయ్య‌న్న రణదీప్‌
  • ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఏకాభిప్రాయంతోనే సాధ్యమన్న ఖర్గే
  • మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే
  • ఎవరిని ఇష్టపడుతున్నారు అనేది కాదు, ఎవరు కష్టపడుతున్నారనేదానికే ప్రాధాన్యం ఇవ్వాలన్న డీకే

Karnataka | కర్ణాటక సీఎం అభ్యర్థి అంశం హస్తినకు చేరింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించినా ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనేది కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందిగా మారింది. సీఎం సీటు కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ ఉండటంతో ఈ అంశాన్ని అధిష్ఠానమే నిర్ణయించాలని సీఎల్పీ తీర్మానం చేసింది. నిన్న బెంగళూరులో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలందరి అభ్యిప్రాయాలు తీసుకున్నామని ఆ నివేదికను అధిష్ఠానానికి అందజేస్తామని పరిశీలకులు చెప్పారు.

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థికి ఎవరన్న నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధిష్ఠానమే అని సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. పార్టీని విజయతీరాలకు చేర్చిన ప్రజలకు, నేతలకు, పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపే మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని శివకుమార్‌ ప్రతిపాదించారు. బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. 6.5 కోట్ల కర్ణాటక ప్రజలకు సేవలు అందిస్తామని మరో తీర్మానం చేశారు.

సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, జితేంద్రసింగ్‌, దీపక్‌ బాబ్రియా హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్‌ సూర్జేవాలా హాజరయ్యారు. ఈ భేటీలో 135 మంది ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాన్ని సేకరించి అధిష్ఠానానికి నివేదించాలనుకున్నారు. ఎమ్మెల్యేలు స్పష్టమై నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో పరిశీలకులు అందరి ఎమ్మెల్యేలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది: రణ్‌దీప్‌ సూర్జేవాలా

సీఎల్పీ భేటీ అనంతరం రణదీప్‌ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పార్టీ సమావేశాలకు సంబంధించిన అన్నిప్రక్రియలు పూర్తయ్యాయి. పరిశీలకులు ఎమ్మెల్యేలందరితో విడివిడిగా సమావేశమ్యారు. వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు వారి నిర్ణయాలకు సంబంధించిన నివేదికను కాంగ్రెస్‌ నాయకత్వాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది’ అని రణ్‌దీప్‌ సూర్జేవాలా తెలిపారు.

మాది ప్రజాస్వామ్యయుత పార్టీ, త్వరలో ప్రభుత్వం ఏర్పాటవుతుంది: ఖర్గే

కర్ణాటక సీఎం అంశం ఢిల్లీకి చేరింది. దీంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ హస్తినకు వెళ్లారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలను కలవడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఏకాభిప్రాయంతోనే సాధ్యమని ఖర్గే ఈ సందర్భంగా అన్నారు. తమది ప్రజాస్వామ్యయుత పార్టీ అని, త్వరలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రకటించారు.

ఎమ్మెల్యే తీర్మానం ద్వారా తేల్చలన్న సిద్ధ, నిరాకరించిన డీకే

సీఎం సీటు కోసం సిద్ధరామయ్య, డీకేల మధ్య పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఎమ్మెల్యేల తీర్మానం ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిని తేల్చాలని సిద్ధరామయ్య పట్టుబట్టారు. దీనికి డీకే నిరాకరించారు. సిద్ధరామయ్యకు ఎమ్మెల్యేల బలం ఉన్నదన్న కారణంతో ఈ నిర్ణయాన్ని అధిష్ఠానానికి వదిలేయాలని పట్టుబట్టారు.

ఎన్నికల్లో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు పాటుపడినానని, తాను వ్యక్తిగతంగా ఏమీ కోరుకోలేదని డీకే అన్నారు. తనకు, సిద్ధరామయ్యకు ఏమాత్రం విభేదాలు లేవని స్పష్టం చేశారు. ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారు అనేదానికంటే ఎవరు కష్టపడుతున్నారనేదానికే ప్రాధాన్యం ఇవ్వాలని డీకే సూచించారు.