7 భాషల్లో 30 గంటల్లో.. 336 పాటల ఆలాపన

  • By: Somu    latest    Oct 03, 2023 11:19 AM IST
7 భాషల్లో 30 గంటల్లో.. 336 పాటల ఆలాపన

విధాత: ప్రముఖ గాయని నాగరత్నం రేటూరి త్యాగరాయ గానసభలో 7 భాషల్లో30 గంటల పాటు 336 పాటలను నిర్విరామంగా ఆలపించి, ఆరు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకొన్నారు. ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ , గోల్డ్ స్టార్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, డైమండ్ వరల్డ్ రికార్డ్, భారత వరల్డ్ రికార్డ్.. మొత్తం ఆరు రికార్డుల కెక్కారు.


ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విస్తృత సంఖ్యలో ప్రేక్షకులు హాజరైనారు. ఆరు రికార్డులు 30 గంటలపాటు ఏకధాటిగా పాడి ఇటు ప్రేక్షకులను, అటు పరిశీలకులను మంత్ర ముగ్ధం చేసిన నాగరత్నం రేటూరిని అందరూ హృదయ పూర్వకంగా అభినందించారు.