Heart attack | ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ.. గుండెల‌విసేలా రోదించిన చెల్లి..

Heart attack | విధాత‌: ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న ఇది.. బ‌తికున్నంత కాలం అన్న‌ద‌మ్ముళ్ల‌తో త‌మ అనుబంధం కొన‌సాగాల‌ని కోరుకుంటూ.. అక్కాచెల్లెళ్లు త‌మ సోద‌రుల‌కు రాఖీలు క‌డుతారు. అంత‌టి పవిత్ర‌మైన రాఖీ ప‌ర్వ‌దినానికి ఒక్క రోజు ముందే.. అన్న‌య్య చ‌నిపోవ‌డంతో ఓ చెల్లి గుండెల‌విసేలా రోదించింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అన్నకు.. చివరిసారిగా రాఖీ కట్టి శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం […]

  • By: Somu    latest    Aug 30, 2023 12:23 PM IST
Heart attack | ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ.. గుండెల‌విసేలా రోదించిన చెల్లి..

Heart attack | విధాత‌: ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న ఇది.. బ‌తికున్నంత కాలం అన్న‌ద‌మ్ముళ్ల‌తో త‌మ అనుబంధం కొన‌సాగాల‌ని కోరుకుంటూ.. అక్కాచెల్లెళ్లు త‌మ సోద‌రుల‌కు రాఖీలు క‌డుతారు. అంత‌టి పవిత్ర‌మైన రాఖీ ప‌ర్వ‌దినానికి ఒక్క రోజు ముందే.. అన్న‌య్య చ‌నిపోవ‌డంతో ఓ చెల్లి గుండెల‌విసేలా రోదించింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అన్నకు.. చివరిసారిగా రాఖీ కట్టి శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనుకయ్య సోమవారం గుండెపోటుతో మరణించాడు. అతని అంత్యక్రియలను మంగళవారం నిర్వహించాల్సి ఉంది. రాఖీ పండుగకు ఒక్క రోజు ముందే తన అన్న దూరం కావడంతో అతని చెల్లెలు గౌరమ్మ ఎంతగానో కుమిలిపోయింది. సోదరుడి మృతదేహానికి చివరిసారిగా రాఖీ కట్టి తన పేగుబంధాన్ని చాటుకుంది. ఇదే నా అన్నకు నేను కట్టే చివరి రాఖీ.. వచ్చే ఏడాది నుంచి రాఖీ కట్టేందుకు నా అన్న ఉండడు అంటూ గుండెలవిసేలా విలపించింది. చెల్లెలు గౌరమ్మ రోదన చూసిన వాళ్లందరినీ దుఃఖసాగరంలో ముంచేసింది.