TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. 19మందిని సాక్షులుగా చేర్చిన SIT

జాబితాలో అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మి కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ యజమాని నిన్న అరెస్టు చేసిన ముగ్గురిని వారం పాటు కస్టడీ కోరిన సిట్‌ సర్వీస్‌ కమిషన్‌లో పనిచేస్తున్న‌ మరో ఇద్దరికి అధిక‌ మార్కులు విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ(Paper Leakage)పై సిట్‌(SIT) దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మిని, ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి వద్ద పనిచేసిన […]

TSPSC: పేపర్‌ లీకేజీ కేసు.. 19మందిని సాక్షులుగా చేర్చిన SIT
  • జాబితాలో అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మి
  • కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ యజమాని
  • నిన్న అరెస్టు చేసిన ముగ్గురిని వారం పాటు కస్టడీ కోరిన సిట్‌
  • సర్వీస్‌ కమిషన్‌లో పనిచేస్తున్న‌ మరో ఇద్దరికి అధిక‌ మార్కులు

విధాత‌: టీఎస్‌పీఎస్సీ(TSPSC) పేపర్‌ లీకేజీ(Paper Leakage)పై సిట్‌(SIT) దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్ష్మిని, ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి వద్ద పనిచేసిన జూనియర్‌ అసిస్టెంట్‌లను, కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ యజమాని, హోటల్‌ సిబ్బందిని సిట్‌ సాక్షులుగా చేర్చింది.

ఈ నెల 4వ తేదీన ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌ లో ఈ కేసులో నిందితులుగా ఉన్న నీలేష్‌, గోపాల్‌, డాక్యా నాయక్‌ బస చేశారు. ఇద్దరు నిందితులు నీలేష్‌, గోపాల్‌ హోటల్‌లో ప్రశ్నపత్రం చూసి ప్రిపేర్‌ అయ్యారు. హోటల్‌ నుంచి నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లారు. హోటల్‌లో సీసీ కెమెరాలతో పాటు, సిబ్బంది వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు.

మరోవైపు నిన్న అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను సిట్‌ 7 రోజుల కస్టడీకి కోరింది. ఈ కేసులో సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, షమీమ్‌, రమేష్‌ నలుగురు ఉద్యోగులను అరెస్ట్‌ చేసింది. నిందితుల నుంచి 3 మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నది. ప్రవీణ్‌, రాజశేఖర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా షమీమ్‌, రమేష్‌లను అరెస్టు చేసింది.

టీఎస్‌పీఎస్సీలో గ్రూప్‌-1 రాసిన అభ్యర్థులపై సిట్‌ ఆరా తీయగా.. అందరూ ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో సర్వీస్‌ కమిషన్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరికి భారీగా మార్కులు వచ్చినట్టు గుర్తించారు.

2013లో గ్రూప్‌-2 ఉద్యోగం పొందిన షమీమ్‌ కు 127మార్కులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రమేష్‌కు 122 మార్కులు వచ్చినట్టు సిట్‌ బృందం గుర్తించింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌ నుంచి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ తీసుకున్నట్టు షమీమ్‌ తెలిపారు. దీనికోసం డబ్బులేమీ తీసుకోలేదన్నాడు.