Mrunal Thakur | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న సీతారామం బ్యూటీ..! రేటు భారీగా పెంచేసిందిగా..!
Mrunal Thakur | దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత.. ఫేమ్‌లో ఉన్న సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది కొత్త సామెత. ఈ సామెతను అక్షరాల పాటిస్తున్నది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్. టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారింది. కెరీర్ ప్రారంభంలో పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన బ్యూటీ.. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చిత్రం ఘన విజయం సాధించింది. చిత్రంలో ‘సీత’ పాత్రలో అద్భుతమైన […]

Mrunal Thakur |
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేది పాత సామెత.. ఫేమ్‌లో ఉన్న సమయంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది కొత్త సామెత. ఈ సామెతను అక్షరాల పాటిస్తున్నది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్. టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ ప్రస్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారింది.
కెరీర్ ప్రారంభంలో పలు బాలీవుడ్ సినిమాల్లో మెరిసిన బ్యూటీ.. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద చిత్రం ఘన విజయం సాధించింది. చిత్రంలో ‘సీత’ పాత్రలో అద్భుతమైన నటనతో అందరినీ ఫిదా చేసింది. దీంతో ఒక్కసారిగా మృణాల్ పేరు మార్మోగింది.
ప్రస్తుతం భారీగా అవకాశాలు వస్తున్నాయి. ఇదే అదునుగా బ్యూటీ రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని టాక్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2కోట్ల డిమాండ్ చేస్తుందని ఓ నివేదిక తెలిపింది. సీతారామం సినిమాకు మృణాల్ రూ.85లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. సీతారామం హిట్ తర్వాత బ్యూటీ రూ.2కోట్ల వరకు పారితోషకం డిమాండ్ చేస్తుంది.
ప్రస్తుతం మృణాల్‌కు టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్-2’లో నటించింది. ప్రస్తుతం మృణాల్ చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలున్నాయి. అలాగే టాలీవుడ్‌లో నానీ 30వ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నది.
అలాగే విజయ్ దేరవకొండ సరసన ఓ సినిమాలో నటించనున్నది. ఈ చిత్రానికి రూ.2కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, దాంతో నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మృణాల్ ఠాగూర్ 2014లో వచ్చిన మరాఠీ మూవీ ‘విట్టిదండు’తో బిగ్‌స్క్రీన్‌పై కనిపించింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో లవ్ సోనియా, సూపర్ 30, బాట్లా హౌస్, జెర్సీ సహా పలు చిత్రాల్టో నటించింది. ఆ తర్వాత తెలుగులో ‘సీతారామం’ చిత్రంతో జాతకమే మారిపోయింది. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం క్లాసిక్ అందమైన ప్రేమకావ్యంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నది.