అంతులేని స్వేచ్ఛ.. సోషల్ మీడియా అరాచకం! (కత్తులు.. కర్రలు లేకుండానే యుద్ధం)
ఉన్నమాట: సోషల్ మీడియా.. ఇది ఓ రెగ్యులర్ మీడియాకు ప్రత్యామ్నాయం అని భావిస్తూ వస్తున్నారు. అంటే ప్రధాన మీడియాలోకి ఎక్కేందుకు అవకాశం లేనివాళ్ళు.. తమ గళాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించాలని కోరుకునేవాళ్లకు సోషల్ మీడియా ఓ వేదిక అయింది..ఓ ఆయుధం అయింది.. కొన్ని సందర్భాల్లో పాలకులకు సైతం మార్గాన్ని సూచించే దిక్సూచి అయింది. కానీ అంతులేని స్వేచ్ఛ.. పరిమితుల్లేని సృజనాత్మకత కలిసి అనైతికత వైపు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా టీడీపీ.. ysrcp పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు […]

ఉన్నమాట: సోషల్ మీడియా.. ఇది ఓ రెగ్యులర్ మీడియాకు ప్రత్యామ్నాయం అని భావిస్తూ వస్తున్నారు. అంటే ప్రధాన మీడియాలోకి ఎక్కేందుకు అవకాశం లేనివాళ్ళు.. తమ గళాన్ని బాహ్య ప్రపంచానికి వినిపించాలని కోరుకునేవాళ్లకు సోషల్ మీడియా ఓ వేదిక అయింది..ఓ ఆయుధం అయింది.. కొన్ని సందర్భాల్లో పాలకులకు సైతం మార్గాన్ని సూచించే దిక్సూచి అయింది.
కానీ అంతులేని స్వేచ్ఛ.. పరిమితుల్లేని సృజనాత్మకత కలిసి అనైతికత వైపు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా టీడీపీ.. ysrcp పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు ఇప్పుడు కత్తులు.. కర్రలు లేకుండానే యుద్ధం చేస్తున్నాయి. ఇద్దరూ అనైతికత అనే మెట్టు మీద నిలబడి ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేని మహిళలు.. పిల్లలను సైతం ఈ రొంపిలోకి లాక్కొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాయ్.

ముఖ్యంగా ఏపీలో ప్రధాన మీడియా పార్టీల వారీగా చీలిపోయింది. దీంతో ప్రజలంతా సోషల్ మీడియానే విశ్వసిస్తున్నారు. అందులో వచ్చినవే నిజమనుకుంటున్నారు. దీంతో అక్కడ కూడా ఆయా పార్టీలు విష సంస్కృతిని వ్యాపింపజేస్తున్నాయి. ఒక నేత అనని మాటలను అనినట్టు వీడియోలను తమకు కావాల్సిన చోట కట్ చేసి.. అవసరమైన చోట అతికించి నిజమని భ్రమింపజేస్తూ సర్క్యులేట్ చేస్తున్నాయి.
అంతే కాకుండా రాయలేని మాట్లాడలేని రీతిలో తమకు గిట్టని వ్యక్తులపై బూతులు తిట్లతో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాల్లోని మహిళలను పసి పిల్లలను సైతం దీనిలోకి లాగి రచ్చ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయా పార్టీల మధ్య జరుగుతున్న బూతుల దాడి తీవ్ర విమర్శలు చూసిన సగటు సాధారణ నెటిజన్లు ఏవగించుకుంటున్నారు.
సోషల్ మీడియా నిజాలను వెలికి తీస్తుందనుకుంటే చివరకు ఇలా మారిపోయిందేమిటనే ఆవేదన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఆయా పార్టీలు నేతలు పెట్టే పోస్టులను వైరల్ చేయడం.. మళ్లీ వాటిని ప్రధాన మీడియాలో చూపించడం రాయడం ఇలా ఈ దారుణం కొనసాగుతూనే ఉంటుందని ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లో భారత్ పే అనే పేమెంట్ యాప్ మాదిరిగా పేభారతి భారతిపే అంటూ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి పేరుతో టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కామ్ తో భారతికి ముడిపెట్టి ఓ క్యూ ఆర్ కోడ్ ఉన్న క్లిప్పింగ్ రూపొందించి ఆమెకు డబ్బు చెల్లించాలి అంటూ సర్క్యులేట్ చేస్తున్నారు.
ఇటు వైసీపీ సోషల్ మీడియా సైతం ఏమీ తక్కువ తినలేదు. లోకేష్ సతీమణి బ్రహ్మిణి, కుమారుడు దేవాన్స్ లను సైతం వెకిలిగా కామెంట్ చేస్తూ క్లిప్పింగ్స్ రూపొందించి సోషల్ మీడియా ప్లేట్ ఫారాల్లోకి వదులుతున్నారు. టీడీపీ వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానిస్తుంటే ఇటు వైఎస్సార్సీపీ వాళ్ళు చంద్రబాబును, ఎన్టీయార్ ను వెక్కిరిస్తూ అవమానిస్తూ అడ్డూ అదుపూ లేని రీతిలో సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు.