Sonia Gandhi | సోనియాకు ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేర్పించిన రాహుల్
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

Sonia Gandhi |
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె జ్వరంతో కూడా బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు.