డబుల్ బెడ్రూం నిర్మాణంలో వేగం పెంచాలి: మంత్రి వేముల
చెప్పినవి చేతల్లో చూపిద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం డబుల్ బెడ్‌రూం స్కీం లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం, అప్పగింత లబ్ధిదారుల ఎంపిక పారదర్శకం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వేముల విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న డబులు బెడ్రూం ఇండ్ల పథకం విషయంలో తీవ్ర విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, జిల్లాల్లో మచ్చుకు కొన్నికట్టి ప్రచారం చేసుకుంటున్నారనే అపవాదు బాగా ప్రచారంలో ఉన్నది. లబ్ధిదారులుగా తమకు […]

- చెప్పినవి చేతల్లో చూపిద్దాం
- రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాం డబుల్ బెడ్‌రూం స్కీం
- లక్ష్యానికి అనుగుణంగా ఇండ్ల నిర్మాణం, అప్పగింత
- లబ్ధిదారుల ఎంపిక పారదర్శకం
- జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వేముల
విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న డబులు బెడ్రూం ఇండ్ల పథకం విషయంలో తీవ్ర విమర్శలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్, జిల్లాల్లో మచ్చుకు కొన్నికట్టి ప్రచారం చేసుకుంటున్నారనే అపవాదు బాగా ప్రచారంలో ఉన్నది. లబ్ధిదారులుగా తమకు ఆ పథకం కింద ఇల్లు దక్కిందని, ఇక ముందు దక్కుతుందనే నమ్మకం ప్రజల్లో కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యగా… అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించారు. కాన్ఫరెన్స్‌లో సీఎస్ సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు
రెండు పడక గదుల నిర్మాణ పథకం పేద వారి ఆత్మ గౌరవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో అధ్యయనం చేసి రూపొందించడం జరిగిందని మంత్రి వేముల అన్నారు. 560 చ. అడుగుల ప్లింత్ ఏరియాతో, 100శాతం సబ్సిడీతో అమలు చేస్తున్నదేశంలోనే ఏకైక పథకమని తెలిపారు. ఈ పథకం అమలులో జిల్లా కలెక్టర్లు అంకిత భావంతో పని చేసి ఫలాలు అర్హులైన పేదలకు అందేట్లు చూడాలని కోరారు.
ఇండ్ల ప్రగతిని సమీక్షించిన ఆయన… ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,91,057 గృహాలు.. రూ 19,328.32 కోట్ల ప్రతిపాదిత వ్యయంతో మంజూరు చేశారు. అయితే 2,28,529 ఇండ్లకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.
మంత్రి వేముల ప్రకారం.. జిల్లాల్లో ఆరభించిన 1,28,999 ఇండ్లలో 61,840 పూర్తయ్యాయి. మరో 40,169 ఇండ్లు నిర్మాణం తుది దశలో ఉన్నాయి. 26,990 ఇండ్ల పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు రూ.4,983.25 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
అదేవిధంగా ఇంకనూ సుమారు 70వేల మంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియను వెంటనే ఆరంభించి, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా పూర్తి చేసి ఇండ్లను అర్హులకు 2023 జనవరి 15 లోగా అంద చేయాలని మంత్రి వేముల ఆదేశించారు.