5న రాష్ట్ర కేబినెట్ భేటీ.. అదే రోజు బ‌డ్జెట్‌కు ఆమోదం..!

విధాత: ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్షత‌న ఉద‌యం 10:30 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెల‌ప‌నుంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాందేడ్‌లో నిర్వ‌హించే బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌కు బయ‌ల్దేర‌నున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై […]

  • By: krs    latest    Feb 02, 2023 2:44 PM IST
5న రాష్ట్ర కేబినెట్ భేటీ.. అదే రోజు బ‌డ్జెట్‌కు ఆమోదం..!

విధాత: ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్షత‌న ఉద‌యం 10:30 గంట‌ల‌కు కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఈ స‌మావేశంలో బ‌డ్జెట్‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెల‌ప‌నుంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాందేడ్‌లో నిర్వ‌హించే బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌కు బయ‌ల్దేర‌నున్నారు.

ఈ నెల 3వ తేదీ నుంచి రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప్ర‌సంగించ‌నున్నారు.

అనంత‌రం బీఏసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వ‌హించాల‌నే విష‌యంపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.