కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి.. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రేవంత్ రెడ్డి పిలుపు

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు గంజాయి బ్యాచ్ పనే.. పవన్ పై దాడి వినయ్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ సభపై దాడి తేల్చుకుందామంటే ఎక్కడైనా సిద్ధం టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్(Congress) కార్యకర్తలపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ (CM KCR)దిష్టిబొమ్మను దహనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాలని కోరారు. ఈ నిరసన సెగ […]

కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి.. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రేవంత్ రెడ్డి పిలుపు
  • సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు
  • గంజాయి బ్యాచ్ పనే.. పవన్ పై దాడి
  • వినయ్ ఆదేశాల మేరకే కాంగ్రెస్ సభపై దాడి
  • తేల్చుకుందామంటే ఎక్కడైనా సిద్ధం
  • టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి

కాంగ్రెస్(Congress) కార్యకర్తలపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ (CM KCR)దిష్టిబొమ్మను దహనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy) పిలుపునిచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించాలని కోరారు. ఈ నిరసన సెగ కేసీఆర్‌కు తగలాలని ఆయన ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. పవన్‌పై దాడి జరిగిన నేపథ్యంలో మంగళవారం ఆయనను హాస్పిటల్లో (Hospital) పరామర్శించిన అనంతరం వరంగల్ సీపీ రంగనాథ్ ను కలిశారు. ఈ సందర్భంగా రాతపూర్వక ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ (Congress) కార్యకర్త తోట పవన్‌పై జరిగిన దాడి ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటన కాదు.. మా యాత్రపైనే దాడి జరిగినట్టుగా భావిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. విపక్ష పార్టీలపై అధికార పార్టీ ఈ విధమైన దాడులకు పాల్పడితే రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో పోటీపడాలనుకుంటే నేను మా కార్యకర్తలతో కలిసి ప్రగతిభవన్ కైనా, ఫామ్ హౌస్ కైనా, లేకుంటే వరంగల్ హంటర్‌రోడ్ లోనైనా తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

  • రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న గులాబీ నేతలు

మంత్రి ఎర్రబెల్లి (Minister Errabelli) ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇటీవల తాము తలుచుకుంటే యాత్రలు చేయలేవని చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలోనే వినయ్ భాస్కర్ డైరెక్షన్‌లో తమపై దాడి జరిగిందని వీరందరిపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన డీజీపీ వైపు నుంచి స్పందన లేదన్నారు. ఈ దాడిని కాంగ్రెస్ శ్రేణులు సహించవన్నారు.

  • గంజాయి బ్యాచ్ దాడి

గంజాయి(Ganja) బానిసలు మత్తులో అరాచకాలకు పాల్పడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, అతని గంజాయి ముఠాపై హత్యానేరం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటనకు ఎమ్మెల్యే వినయ్ భాస్కరే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందని విమర్శించారు. వినయ్ భాస్కర్ కనుసన్నల్లోనే పవన్‌పై దాడి చేయించారన్నారు.

అక్రమ సంపాదన కోసం ల్యాండ్, సాండ్, మైన్, అటెంప్ట్ రేప్‌లలో కూడా బీఆర్ఎస్ నేతలే ఉంటున్నారని తెలిపారు. రాజకీయంగా వారికి నూకలు చెల్లాయనే ఎమ్మెల్యే ముఠా పవన్‌ను చంపాలని ప్రయత్నించిందని ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన పవన్ చావు నుంచి తప్పించుకున్నాడని పేర్కొన్నారు. చైతన్యవంతమైన వరంగల్ గడ్డపై ఇలాంటి దాడులు జరగడం దుర్మార్గం అని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ విధి నిర్వర్తించడం లేదన్నారు.

  • ఎమ్మెల్యే ఆదేశాల మేరకే దాడి

ఎమ్మెల్యే (MLA) వినయ్ ఆదేశాల మేరకే తనపై దాడి జరిగిందని పవన్ చెప్పినట్లు రేవంత్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేపై, అతని ముఠా సభ్యులను అరెస్టు చేయాల్సిన పోలీసులు వారిని కాపాడుతున్నారన్నారు. పోలీసులు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదని, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు శాశ్వతం కాదన్నారు.

క్రిమినల్ చర్యలను ఉక్కు పాదంతో అణచాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. దాడులు చేసి వీడియోలు చిత్రీకరించి బెదిరిస్తున్నా పోలీసులు నిస్సహాయంగా ఉండటం మంచిది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.