Stuart Broad: కెరీర్ లో చివరి బంతికి సిక్సర్ కొట్టి చరిత్ర సృష్టించిన బ్రాడ్
Stuart Broad:క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. టీమ్ ఇండియాతో పాటుగా మిగతా బాటర్స్, బౌలర్స్ అంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ కూడా ఉంది. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన బౌలింగ్ ఫామ్‌తో ఉండగానే క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే ఇది తనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని బ్రాడ్ ప్రకటించాడు. టెస్టుల్లో 600 వికెట్లు తీసుకున్న 7వ బౌలర్‌గా ఇటీవలే […]

Stuart Broad:క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. టీమ్ ఇండియాతో పాటుగా మిగతా బాటర్స్, బౌలర్స్ అంటే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు క్రేజ్ కూడా ఉంది. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుతమైన బౌలింగ్ ఫామ్‌తో ఉండగానే క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో ఐదో టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే ఇది తనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని బ్రాడ్ ప్రకటించాడు. టెస్టుల్లో 600 వికెట్లు తీసుకున్న 7వ బౌలర్‌గా ఇటీవలే అవతరించిన బ్రాడ్ ఇలా అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇదే టైమ్ లో ఆదివారం తన టీమ్‌మేట్ జిమ్మీ అండర్సన్‌తో కలిసి బ్రాడ్ బ్యాటింగ్‌కి వస్తున్న సమయంలో.. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంతా అతనికి గాడ్ ఆఫ్ హానర్ అందించారు.
మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు స్టాడింగ్ ఓవేషన్‌తో పాటు చప్పట్లు మిన్నంటించారు. ఈ క్రమంలో బ్రాడ్ చివరిసారిగా మైదానంలోకి అడుగు పెడుతూ ఒకింత ఎమోషనల్ అయ్యాడు. యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి, ఐదవ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైరవుతున్నట్లుగా ప్రకటించిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ తన కెరీర్ చివరి టెస్ట్‌లో ఎదుర్కోన్న ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి అరుదైన రికార్డులకెక్కాడు.
బ్రాడ్ తన కెరీర్ ప్రారంభంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ చేతిలో భంగపడ్డప్పటికీ.. మైదానంలో ప్రేక్షకులను నిరాశపరచలేదు. 17 ఏళ్లుగా ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న బ్రాడ్ ఇంగ్లీష్ జట్టుకు అద్భుతమైన సేవలు అందించాడు. 37ఏళ్ల బ్రాడ్ టెస్ట్‌ల్లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్ట్ఐ లో ఐదవ స్థానంలో నిలిచాడు. బ్రాడ్ తన కెరీర్‌లో 167 టెస్టులు ఆడి ఏకంగా 602 వికెట్లు తీసుకున్నాడు. తన చివరి టెస్టు ఇంకా జరుగుతున్న క్రమంలో ఇంకొన్ని వికెట్లు తీసుకునే అవకాశం అతనికి ఉంది. బ్యాటింగ్‌లోనూ 3,662 టెస్టు పరుగులు చేశాడు.