Stuart broad: ఆ క్రికెటర్ అంటే నా పెళ్లానికి పిచ్చి అంటూ స్టార్ బౌలర్ షాకింగ్ కామెంట్స్
Stuart broad: ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ పై అదే జట్టుకి చెందిన స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసలు కురిపించాడు. అతను అద్భుతమైన ఆటగాడని కొనియాడుతూ ఆయన అంటే తన భార్య మోలీకి పిచ్చి అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతని తర్వాతే తాను అని మోలీ తెలియజేసిందని బ్రాడ్ అన్నారు. ప్రస్తుతం వోక్స్ యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో వోక్స్ అసాధారణ ప్రదర్శన కనబరచి ఆ జట్టు సిరీస్ అవకాశాలను […]

Stuart broad: ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ పై అదే జట్టుకి చెందిన స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసలు కురిపించాడు. అతను అద్భుతమైన ఆటగాడని కొనియాడుతూ ఆయన అంటే తన భార్య మోలీకి పిచ్చి అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతని తర్వాతే తాను అని మోలీ తెలియజేసిందని బ్రాడ్ అన్నారు. ప్రస్తుతం వోక్స్ యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో వోక్స్ అసాధారణ ప్రదర్శన కనబరచి ఆ జట్టు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచాడు. నాలుగో టెస్ట్ మరి కొద్ది రోజులలో జరగనున్న నేపథ్యంలో డెయిలీ మొయిలీకి రాసిన కాలమ్‌లో స్టువర్ట్ బ్రాడ్.. క్రిస్ వోక్స్ గురించి ఇలా ప్రశంసలు గుప్పించాడు.
‘క్రిస్ వోక్స్ అసాధారణమైన ఆటగాడు అని చెప్పిన నా సతీమణి , అతను తన ఫేవరేట్ ప్లేయర్ అని చెప్పింది. అప్పుడు వెంటనే నేను మరీ? అని అడగగా, దానికి ఆమె.. క్రిస్ వోక్స్ తర్వాతే నీ స్థానం అని బదులుచ్చింది. ఇది అతనికి దక్కిన అతిపెద్ద ప్రశంసగా నేను భావిస్తున్నాను. ఇంగ్లండ్ జట్టు రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో వోక్స్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో వోక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు.’అని బ్రాడ్ రాసుకొచ్చాడు.
మార్క్ వుడ్ ఇంగ్లండ్ తుది జట్టులో ఉంటే టీమ్ బలం పెరుగుతుందని బ్రాడ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక బుధవారం(జూలై 19) నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుండగా, ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇంగ్లండ్ తుది జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. తుది జట్టులో ఇంగ్లండ్ జట్టు ఏకైక మార్పు మాత్రమే చేసింది. మూడు టెస్ట్‌ల్లో పూర్తిగా విఫలమైన ఓలీ రాబిన్సన్‌పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్.. అతని స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తిరిగి తీసుకుంది. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో దూకుడుగా క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్.. తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం ముంగిట బోర్లా పడడం అభిమానులని కాస్త నిరాశపరచింది.. మూడో టెస్ట్‌లో మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్ అసాధారణ ప్రదర్శనతో జట్టు అద్భుతమైన విజయం సాధించింది.