విద్యార్థులు.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

విద్యార్థులు.. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

విధాత: మెదక్ బ్యూరో: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జిల్లాస్థాయి కోకో క్రీడలు నిర్వహిస్తున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన కూడా క్రీడలు అంటే ఇష్టమని , ఇంటర్ వరకు స్కిప్పింగ్ క్రీడాకారునిగా రాణించినట్లు చెప్పారు. క్రీడలు మనో ఉల్లాసం కలిగిస్తాయని, క్రీడల పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి చూపాలన్నారు. చదువు విజ్ఞానాన్ని పెంచితే.. క్రీడల వల్ల శారీరక శ్రమతో ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఓటమి గెలుపుకునాందని, ఓడిపోయామన్న బాధపడకుండా ముందుకు వెళితే గెలుపు సొంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ లావణ్య రెడ్డి, భారాస పట్టణ శాఖ అధ్యక్షులు గంగాధర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రావు పి ఈ టి లు పాల్గొన్నారు.