కదులుతున్న రైలులో ఆయుధాలతో యువకుల స్టంట్స్.. వీడియో వైరల్
విధాత: వేగంగా దూసుకెళ్తున్న రైల్లో ఓ ముగ్గురు యువకులు.. పదునైన ఆయుధాలతో స్టంట్స్ చేశారు. రైలు డోర్ వద్ద వేలాడుతూ.. చేతుల్లో ఉన్న ఆయుధాలను తిప్పుతూ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది. చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. పదునైన కత్తులతో స్టంట్స్ చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ ముగ్గురిని అంబరసు, రవిచంద్రన్, ఆరూల్‌గా […]

విధాత: వేగంగా దూసుకెళ్తున్న రైల్లో ఓ ముగ్గురు యువకులు.. పదునైన ఆయుధాలతో స్టంట్స్ చేశారు. రైలు డోర్ వద్ద వేలాడుతూ.. చేతుల్లో ఉన్న ఆయుధాలను తిప్పుతూ ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది.
చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. పదునైన కత్తులతో స్టంట్స్ చేసిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ ముగ్గురిని అంబరసు, రవిచంద్రన్, ఆరూల్‌గా గుర్తించారు. వీరు చెన్నైలోని ప్రెసిడెన్సి కాలేజీలో చదువుతున్నారు.
ఇలాంటి ఘటనలను సహించబోమని రైల్వే మేనేజర్ స్పష్టం చేశారు. రైల్వే పరిసరాలతో పాటు రైల్వేల్లో స్టంట్స్ చేసి, భయానక పరిస్థితులను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు.