Sudigali Sudheer | ర‌ష్మీ నా గుండెల్లో ఉంటుంది: సుధీర్! ఇద్ద‌రి హంగామా మాములుగా లేదుగా..!

Sudigali Sudheer బుల్లితెర రొమాంటిక్ క‌పుల్స్‌లో ముందుగా గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్- ర‌ష్మీ జంట‌. వీరిద్ద‌రు క‌లిసి అనేక షోల‌లో తెగ సంద‌డి చేశారు. సుడిగాలి సుధీర్ కనిపించినప్పుడల్లా రష్మీ గౌత‌మ్ సిగ్గు మొగ్గలేయడం, అలాగే ఆన్ స్క్రీన్ పై చాలా సార్లు వీరి పెళ్లి కూడా కావడంతో వీరి గురించి నిత్యం జ‌నాల‌లో ఏదో ఒక చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌నేది […]

  • By: sn    latest    Aug 10, 2023 12:11 PM IST
Sudigali Sudheer | ర‌ష్మీ నా గుండెల్లో ఉంటుంది: సుధీర్! ఇద్ద‌రి హంగామా మాములుగా లేదుగా..!

Sudigali Sudheer

బుల్లితెర రొమాంటిక్ క‌పుల్స్‌లో ముందుగా గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్- ర‌ష్మీ జంట‌. వీరిద్ద‌రు క‌లిసి అనేక షోల‌లో తెగ సంద‌డి చేశారు. సుడిగాలి సుధీర్ కనిపించినప్పుడల్లా రష్మీ గౌత‌మ్ సిగ్గు మొగ్గలేయడం, అలాగే ఆన్ స్క్రీన్ పై చాలా సార్లు వీరి పెళ్లి కూడా కావడంతో వీరి గురించి నిత్యం జ‌నాల‌లో ఏదో ఒక చ‌ర్చ న‌డుస్తూనే ఉంటుంది. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు ఆఫ్ స్క్రీన్‌లో కూడా ఈ ఇద్ద‌రి మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ న‌డుస్తుంద‌నేది ఇన్‌సైడ్ టాక్.

అయితే ర‌ష్మీ ముందు సుధీర్ గురించి ప్ర‌స్తావ‌న తీయ‌డం, సుధీర్ ముందు ర‌ష్మీ గురించి మాట్లాడడం జ‌రుగుతున్న నేప‌థ్యంలో తామిద్ద‌రం బెస్ట్ ఫ్రెండ్స్ అని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

సుధీర్, ర‌ష్మీలు త‌మ బంధం గురించి ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చిన కూడా ఎప్పుడు వారి గురించి ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇటీవల కాలంలో ర‌ష్మీ, సుధీర్‌లు జంట‌గా క‌నిపించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అయితే “ఈటీవీ 28 వసంతాల” సెలబ్రేషన్స్ లో సుధీర్- ర‌ష్మీ జంట‌గా క‌నిపించి సంద‌డి చేశారు.

తాజాగా వేడుక‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో సీరియల్ నటీనటులు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కమెడియన్లు, సింగర్స్‌తో పాటు కొంతమంది వెండితెర సెలబ్రెటీలు కూడా మెరిసారు. అయితే ఎంత మంది వ‌చ్చిన కూడా ర‌ష్మీ- సుధీర్ క‌నిపించే స‌రికి మాత్రం ప్రేక్ష‌కులు ఫుల్ ఖుష్ అయ్యారు

ఈ ప్రోమోలో సుధీర్-రష్మీ కలిసి అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ఇవ్వ‌డంతో ప్రేక్ష‌కులు చాలా ఎంజాయ్ చేశారు. సుడిగాలి సుధీర్ గుండెలపై వాలిపోయిన రష్మీ గౌత‌మ్ క్రేజీ స్టిల్ ఇచ్చింది. ఇక ప్రోమోలో.. ఏంటి మేడమ్ గారు కొంచెం కోపంగా ఉన్నట్లున్నారని అన‌గా, దానికి స్పందించిన ర‌ష్మీ.. “మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లూ ఎదురుచూశాను.. ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ ” అంటూ కాస్త కోపంగా అడిగింది.

అప్పుడు సుధీర్.. నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం ఇక్కడ (గుండెల్లో) ఉంటావ్ కదా” అని సుధీర్ అదిరిపోయే డైలాగ్ చెప్పాడు. అప్పుడు బ్యాక్ గ్రౌండ్‌లో ఖుషీ సాంగ్ వేసేసి, చుట్టూ చప్పట్లు, ఈలలు, గోలలతో సీన్‌ను ఫుల్ హైలైట్ చేశారు. మొత్తానికి సుధీర్ రాక‌తో షోపై క్రేజ్ మ‌రింత పెరిగింది.