ఎమ్మెల్సీ కవిత కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది

న్యూ ఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని కవిత తరుపు న్యయవాది సవాల్ చేయగా, పిటిషన్‌ను శుక్రవారం పరిశీలించిన సుప్రీం బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందిగా ఆదేశించింది. దీంతో పాటు కవితను ఏ కారణాల చేత అరెస్టు చేశారని ఈడీకి నోటీసులు పంపింది.
జస్టిస్ సంజయ్ ఖన్నా, ఎంఎం సుంద్రేశ్, బేల ఎం త్రివేదీలతో కూడిన దర్మాసనం బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టులో పిటిషన్ వేయకుండా బైపాస్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించడం కోర్టు నియమాలకు ప్రోటోకాల్ కు భిన్నమైందని, ముందుగా అక్కడ పిటిషన్ వేశాక సుప్రీంకు రావాలని సూచించింది. పెండింగ్‌లో ఉన్న కేసులో ఏ నియమాల ప్రకారం అరెస్టు చేశారని డిఫెన్స్ లాయర్ కపిల్ సిబ్బల్‌ను ప్రశ్నించగా , కపిల్ సిబ్బల్ మాట్లాడుతూ అప్రూవర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత మార్చి 23 వరకు తమ కస్టడీలోనే ఉండాలని పేర్కొన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులతో కలిసి కవిత ఈ కుంభకోణం చేసిందని, ముఖ్యంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా మరికొందరి నేతల మెప్పు పొందడానికి ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 100 కోట్లు బహుమానంగా ఇచ్చిందని ఈడీ ఆరోపించింది. ఈడీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ తనపై ఈడీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టివేసింది. తనపై ఈడి తీసుకున్న చర్యలు చట్ట వ్యతిరేకమైనవని ఖండించింది.
కవిత అరెస్టును ఖండించిన బీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులపై బీజేపీ చట్ట వ్యతిరేక పద్దతుల్లో వ్యవహరిస్తూ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారాన్నితప్పుడు పద్ధతుల్లో ఉపయోగించుకుంటుందని, ఉన్నత సంస్థలను తన స్వార్థానికి బలిచేస్తుందన్నారు.