Suryapeta | ఇంటి గోడ కూలి ముగ్గురు దుర్మరణం
Suryapeta విధాత: సూర్యాపేట జిల్లా నాగారం గ్రామంలో ఇటీవల వర్షాలకు నానిన ఇంటి మట్టిగోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. నాగారం గ్రామానికి చెందిన శీలం రాములు(90), భార్య రాములమ్మ(70), కుమారుడు శీలం శ్రీను(35)లు బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి మధ్య గోడ కూలి మీద పడింది. ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం విద్యుత్తు బిల్లు వసూలు కోసం వెళ్లిన సిబ్బంది దీనిని గమనించి సమాచారం అందించారు. సీఐ […]

Suryapeta
విధాత: సూర్యాపేట జిల్లా నాగారం గ్రామంలో ఇటీవల వర్షాలకు నానిన ఇంటి మట్టిగోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. నాగారం గ్రామానికి చెందిన శీలం రాములు(90), భార్య రాములమ్మ(70), కుమారుడు శీలం శ్రీను(35)లు బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంటి మధ్య గోడ కూలి మీద పడింది. ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉదయం విద్యుత్తు బిల్లు వసూలు కోసం వెళ్లిన సిబ్బంది దీనిని గమనించి సమాచారం అందించారు. సీఐ శివశంకర్, ఎస్‌ఐ ముత్తయ్యలు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం తుంగతుర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తహశీల్ధార్ బ్రహ్మయ్య పంచానామా నిర్వహించారు. మృతుడుశ్రీనుకు భర్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం, శ్రీను భార్య, పిల్లలు కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషదానికి గురయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.