TSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్.. టీ-24 టికెట్ ధరలు పెంపు
TSRTC | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ధరను పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. టీ-24 టికెట్ ధరలను తగ్గించి 45 రోజులు గడవకముందే మరోసారి పెంచారు. సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ. 90 నుంచి రూ. 100కు పెంచగా, సీనియర్ సిటిజన్లకు రూ. 80 ఉండగా రూ. 90కి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది. […]

TSRTC | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ధరను పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. టీ-24 టికెట్ ధరలను తగ్గించి 45 రోజులు గడవకముందే మరోసారి పెంచారు.
సాధారణ ప్రయాణికులకు ఈ టికెట్ ధరను రూ. 90 నుంచి రూ. 100కు పెంచగా, సీనియర్ సిటిజన్లకు రూ. 80 ఉండగా రూ. 90కి పెంచింది. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ(ఆపరేషన్స్) ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన టీ -24 టికెట్ ధరలు జూన్ 16 నుంచి జులై 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
గతంలో టీ -24 టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ. 100 ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ 26న రూ. 90కి తగ్గించిన విషయం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు రూ. 80కి టికెట్‌ను అందించింది. మళ్లీ పాత ధరలను TSRTC పునరుద్ధరించింది.