ఘోరం: ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారా?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

Viral Vedio | చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలా ఎక్కడ పడితే అక్కడ యువత సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా సెల్ఫీలు తీసుకుంటూ పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకొల్లలు. అయినా సోషల్‌ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్‌ కోసం ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతున్నారు. అయితే, ఎన్ని ఘటనలు చూసినా పలువురిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు […]

ఘోరం: ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారా?.. ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

Viral Vedio | చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలా ఎక్కడ పడితే అక్కడ యువత సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రమాదమని తెలిసినా సెల్ఫీలు తీసుకుంటూ పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కోకొల్లలు.

అయినా సోషల్‌ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్‌ కోసం ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నామనే విచక్షణ మరిచిపోతున్నారు. అయితే, ఎన్ని ఘటనలు చూసినా పలువురిలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ యువకుడు సెల్ఫీ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వీడియో తీసుకునేందుకు ఏకంగా రైల్వే ట్రాక్ పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కాడు. ఆ తర్వాత హై వోల్టేజీ వైర్లు తాకడంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతానికి గురై కిందపడిపోయాడు.

అప్పటికే ఒళ్లంతా కాలిపోతూ పొగలు వస్తుండగా.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే, హైవోల్టేజీ విద్యుత్‌ వైర్లు కావడంతో అతనికి సహాయం అందించేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అక్కడే ఉన్న కొందరు ప్రమాదం వీడియోను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది.

ఈ వీడియో వైరల్‌ కావడంతో రైల్వే అఫీషియల్స్‌ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ జర‌పాలంటూ నార్త్‌ సెంట్రల్‌ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు పలురకాలుగా స్పందించగా.. ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటూ సూచిస్తున్నారు.