ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్ శిక్షలు.. . పాత పద్ధతిలోనే పాలన
బహిరంగ శిక్షలు.. మహిళల విషయంలో మరీ కఠినం ఇస్లామిక్ షరియత్ లా అమలుకు సన్నాహాలు విధాత: ఆఫ్ఘన్ తాలిబన్లలో ఎలాంటి మార్పు లేదని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న వారిపై తాలిబన్లు తమదైన మార్కు న్యాయం అమలు చేస్తున్నారు. అవినీతి, అనైతిక ప్రవర్తన, స్వలింగ సంపర్కం లాంటి ఆరోపణలున్న వారిని బహిరగం ప్రదేశాల్లో ప్రజలంతా చూస్తుండగా కొరడా దెబ్బల శిక్షలు విధిస్తున్నారు. ఇటీవలే […]

- బహిరంగ శిక్షలు..
- మహిళల విషయంలో మరీ కఠినం
- ఇస్లామిక్ షరియత్ లా అమలుకు సన్నాహాలు
విధాత: ఆఫ్ఘన్ తాలిబన్లలో ఎలాంటి మార్పు లేదని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే పాలనా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న వారిపై తాలిబన్లు తమదైన మార్కు న్యాయం అమలు చేస్తున్నారు.
అవినీతి, అనైతిక ప్రవర్తన, స్వలింగ సంపర్కం లాంటి ఆరోపణలున్న వారిని బహిరగం ప్రదేశాల్లో ప్రజలంతా చూస్తుండగా కొరడా దెబ్బల శిక్షలు విధిస్తున్నారు. ఇటీవలే ఆఫ్ఘన్ లోగర్ ప్రావిన్స్‌లో ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో 14మందిని బహిరంగంగా శిక్షించారు. ఇందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఒక్కొక్కరిని 21నుంచి 39 కొరడా దెబ్బలతో శిక్షించారు.
మహిళలు కాలు బయట పెడితే..
ముఖ్యంగా మహిళల హక్కుల విషయంలో తాలిబన్లది ప్రత్యేక పద్ధతి. స్త్రీలు ఇంటివద్దనే ఉండాలి. ఇంటిని వదిలి బయట పనిచేయటానికి వీలులేదు. మహిళ ఒంటరిగా గడపదాటి కాలు బయట పెట్టటానికి ఆస్కారం లేదు. బయటకు వెళ్తే తోడుగా కుటుంబానికి చెందిన పురుషున్ని తీసుకెళ్లాలి. మహిళ ఎప్పుడూ ముఖంపై నిండుగా కప్పుకోవాలి. లేదంటే శిక్షార్హులవుతారు.
ఇటీవల ముఖాన్ని కప్పుకోలేదన్న నెపంతో ఓ మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయిన ఘటనతో ఆప్ఘన్ అంతా అట్టుడికింది. స్త్రీలు రోడ్డెక్కి తమ హక్కుల కోసం ఉద్యమించారు. ఇంత జరుగుతున్నా తాలిబన్ల పాలనలో ఇసుమంతైనా మార్పు కనిపించటం లేదు. 90ల నాటి పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు.
చిన్న నేరాలకూ కొరడా దెబ్బల శిక్ష..
1990లలో ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో ప్రపంచమంతా చూసింది. సాధారణ నేరాలకు సైతం బహిరంగ ఉరిశిక్షలు అమలు చేశారు. షరియత్ లా అమలు పేరిట మధ్యయుగాల ఆటవిక న్యాయం అమలు చేశారు. తిరిగి గత సంవత్సరం 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారం చేజిక్కించు కున్నారు. తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న పరిస్థితుల్లో తాలిబన్లు ఇస్లామిక్ షరియత్ లా అమలుకు పూనుకొంటున్నారు. రోజూ ఏదో చోట చిన్న చిన్న నేరాలకు సైతం బహిరంగ కొరడాదెబ్బల శిక్షలు అమలు చేస్తున్నారు.