చేతిలో బీర్ గ్లాస్‌తో తమన్నా రచ్చ రచ్చ

విధాత: తమన్నా భాటియా ఎంతో కాలంగా తెలుగులో మారుమోగిపోయిన పేరు. కోలీవుడ్లో కూడా అంతే. బాలీవుడ్‌లో కూడా నటించింది. కానీ గత కొంత కాలంగా ఆమె ఫేడ్ అవుట్ అవుతూ వస్తుంది. చేతిలో సినిమాలు లేవు. దాంతో టైర్‌2, టైర్ 3 హీరోలతో కలిసి నటిస్తోంది. ఇటీవలే గుర్తుందా సీతాకాలం సినిమాలో నటించింది. అందులో స‌హాయ‌న‌టుడిగా తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన స‌త్య‌దేవ్ హీరో. ఈ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. […]

  • By: krs    latest    Jan 09, 2023 6:28 AM IST
చేతిలో బీర్ గ్లాస్‌తో తమన్నా రచ్చ రచ్చ

విధాత: తమన్నా భాటియా ఎంతో కాలంగా తెలుగులో మారుమోగిపోయిన పేరు. కోలీవుడ్లో కూడా అంతే. బాలీవుడ్‌లో కూడా నటించింది. కానీ గత కొంత కాలంగా ఆమె ఫేడ్ అవుట్ అవుతూ వస్తుంది. చేతిలో సినిమాలు లేవు. దాంతో టైర్‌2, టైర్ 3 హీరోలతో కలిసి నటిస్తోంది. ఇటీవలే గుర్తుందా సీతాకాలం సినిమాలో నటించింది. అందులో స‌హాయ‌న‌టుడిగా తెలుగు వారికి ప‌రిచ‌య‌మైన స‌త్య‌దేవ్ హీరో. ఈ చిత్రం ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు.

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు. దాంతో గెస్ట్ రోల్స్‌, ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక చిత్రం వేదాళం రీమేక్‌గా చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రానున్న ‘భోళాశంకర్’ మాత్రమే. సైరా నరసింహారెడ్డి‌లో తాను అడిగిన వెంటనే ఏదో కాస్త మంచి పాత్ర చేసిందని చిరు ఏరికోరి బోళా శంకర్ సినిమాలో ఈమెకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అయినా కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు వచ్చే అవకాశం లేదు. దాదాపు ఆమె కెరీర్ ముగింపు దశలో ఉంది.

ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఒకటిన్న‌ర దశాబ్దం అవుతోంది. దాంతో ఇంట్లో వారు కూడా ఇక పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారట. దాంతో తన జోడును తానే చూసుకుంది. హైదరాబాదీ అయినా విజయ వర్మతో ప్రస్తుతం ఆమె డేటింగ్ చేస్తోంది. విజయ వర్మ చిట్టాగ్యాంగ్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు.

తెలుగులో నాని హీరోగా నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్ పాత్ర పోషించాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్‌లో నటించారు. అక్కడ వీరికి ప్రేమ చిగురించింది. అది చాలా దూరం వెళ్ళింది. న్యూ ఇయర్ సందర్భంగా తమన్నా విజయ్ వర్మతో కలిసి గోవాలో హల్ చల్ చేశారు. వారిద్దరి ముద్దు సీన్ల వీడియో వైర‌ల్ అయిపోయింది. ఆ ఫోటోలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.

తాజాగా మరికొన్ని ఫోటోలు తమన్నా తన ఇన్‌స్టాగ్రమ్‌లో డంప్ చేసింది. ఇందులో ఆమె బికినీ షోలు పొట్టి పొట్టి డ్రెస్సులు, షార్ట్ జీన్స్ మీద తెల్ల చొక్కా వేసుకుని చేతిలో బీర్ గ్లాసు పట్టుకుని డాన్స్ చేస్తున్న వీడియో తాజాగా వైరల్ అవుతుంది. ఈ గొడవంతా ఎందుకు? ఆ పెళ్లి చేసుకొని తాను తెలంగాణకు కోడ‌లు అయిపోవచ్చు కదా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయినా వీరి డేటింగ్ అసలు పెళ్లి దాకా వెళ్తుందా? లేక.. మూణ్ణాళ్ల ముచ్చట అవుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది…!