మరో సినీ నటి ఆత్మహత్య.. ప్రేమే కారణమా?
విధాత : తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి పౌలిన్ జెస్సికా చెన్నైలోని విరుగంబక్కంలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. జెస్సికా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ. మృతదేహాన్ని ఏపీకి తరలించారు. జెస్సికా దీపగా అందరికీ సుపరిచితం. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం వైధాలో జెస్సికా నటించింది. పలు తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఆమె నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో […]

విధాత : తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి పౌలిన్ జెస్సికా చెన్నైలోని విరుగంబక్కంలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. జెస్సికా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ. మృతదేహాన్ని ఏపీకి తరలించారు. జెస్సికా దీపగా అందరికీ సుపరిచితం.
ఇటీవల విడుదలైన తమిళ చిత్రం వైధాలో జెస్సికా నటించింది. పలు తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఆమె నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యమైంది. తన ఆత్మహత్యకు కారణం.. రిలేషన్‌షిప్ విఫలం కావడమే అని పేర్కొన్నది. జెస్సికా ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.