N Lingusamy | తమిళ దర్శకుడు లింగుస్వామికి 6 నెలల జైలు.. కారణం ఏంటంటే..?
N Lingusamy | తమిళ దర్శకుడు లింగుస్వామి మద్రాస్ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో విచారణ అనంతరం మద్రాస్ ప్రిన్సిపల్ కోర్టు తీర్పును వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ సుపరిచితులే. ఆయన గతంలో తన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌తో కలిసి గతంలో ‘తిరుపతి బ్రదర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌లో కార్తి, సమంత జంటగా ‘ఎన్ని ఇజు […]

N Lingusamy | తమిళ దర్శకుడు లింగుస్వామి మద్రాస్ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో విచారణ అనంతరం మద్రాస్ ప్రిన్సిపల్ కోర్టు తీర్పును వెలువరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్శకుడు లింగు స్వామి దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ సుపరిచితులే. ఆయన గతంలో తన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌తో కలిసి గతంలో ‘తిరుపతి బ్రదర్స్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌లో కార్తి, సమంత జంటగా ‘ఎన్ని ఇజు నాల్ కుల్ల’ పేరిట సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సినిమా కోసం 2014 పీవీపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.1.05 వరకు అప్పు తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు మాత్రం పట్టాలెక్కలేదు. దాంతో పీవీపీ సంస్థకు తిరిగి చెల్లించేందుకు ఆ మొత్తానికి చెక్ ఇవ్వగా.. బౌన్స్ అయ్యింది. దాంతో సంస్థ కేసు పెట్టింది. కేసు విచారించిన కోర్టు గతేడాది ఆగస్ట్‌లో లింగుస్వామికి జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం తీర్పును సవాల్ చేయగా.. విచారణ జరిపిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఆరు నెలల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే, కోర్టు తీర్పుపై ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ స్పందించారు. మరోసారి అప్పీల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అయితే, అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చినట్లు సమాచారం. లింగుస్వామి లింగుస్వామి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన తమిళ సినిమాలు ‘పందెంకోడి, అవారా’ పేరుతో అనువాదం కాగా.. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాయి. రామ్‌పోతినేనితో గతేడాది తొలిసారిగా నేరుగా తెలుగులో ‘ది వారియర్’ చిత్రాన్ని తెరకెక్కించగా డిజాస్టర్‌గా నిలిచింది.