లైవ్‌లో పురుగుల మందు తాగిన టీడీపీ నేత
తమ నాయకుడికి టికెట్ కేటాయించలేదంటూ టీడీపీ నేత మీడియా లైవ్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడిన ఘటన కలకలం రేపింది

- తమ నాయకుడికి టికెట్ రాలేదంటూ ఆత్మహత్యా యత్నం
విధాత : తమ నాయకుడికి టికెట్ కేటాయించలేదంటూ టీడీపీ నేత మీడియా లైవ్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబుకి టీడీపీ సీటు కేటాయించలేదని టీడీపీ సీనియర్ నాయకులు పులిమిరామిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధుల ముందే పురుగులమందు తాగాడు.
వెంటనే అక్కడే ఉన్న తోటి టీడీపీ నాయకులు రామిరెడ్డి చేతిలోంచి పురుగుల మందు డబ్బా లాగిపారేసి, అతడిని ఆసుపత్రికి తరలించారు. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల మధ్య పొత్తుతో ఇప్పటిదాకా ఆయా పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధపడిన నేతలు పొత్తులలో భాగంగా టికెట్ రాకపోతుండటంతో వారితో పాటు వారి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. పలుచోట్ల నిరసనలకు దిగుతున్నారు.