Team India: హైదరాబాద్, వైజాగ్‌లో టీమిండియా మ్యాచ్‌లు..ఫ్యాన్స్‌కి పండగే..!
Team India: కరోనా వలన ఇండియాలో జరిగే మ్యాచ్‌ల సంఖ్య చాలా తగ్గింది. ఐపీఎల్ కూడా రెండేళ్ల పాటు విదేశాలలోనే జరిగింది. ఇక ఇప్పుడిప్పుడే మన దగ్గర భారీ సిరీస్‌లు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజులలో వరల్డ్ కప్ టోర్ని కూడా జరగనుంది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే వారి ఆనందాన్ని మరింత పెంచేలా టీమిండియా బ్లాక్‌బస్టర్ హోమ్ సీజన్ షెడ్యూల్ తాజాగా రిలీజ్ చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా హైదరాబాద్, వైజాగ్ లకు […]

Team India: కరోనా వలన ఇండియాలో జరిగే మ్యాచ్‌ల సంఖ్య చాలా తగ్గింది. ఐపీఎల్ కూడా రెండేళ్ల పాటు విదేశాలలోనే జరిగింది. ఇక ఇప్పుడిప్పుడే మన దగ్గర భారీ సిరీస్‌లు జరుగుతున్నాయి. మరి కొద్ది రోజులలో వరల్డ్ కప్ టోర్ని కూడా జరగనుంది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే వారి ఆనందాన్ని మరింత పెంచేలా టీమిండియా బ్లాక్‌బస్టర్ హోమ్ సీజన్ షెడ్యూల్ తాజాగా రిలీజ్ చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా హైదరాబాద్, వైజాగ్ లకు చాలా రోజుల తర్వాత కీలకమైన మ్యాచ్ ల ఆతిథ్యం దక్కింది. 2023-24 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను రిలీజ్ చేయగా, ఈ హోమ్ సీజన్ లో భాగంగా టీమిండియా మొత్తం 16 మ్యాచ్ లు ఆడబోతుంది.
eedu
మొత్తం 16 అంతర్జాతీయ మ్యాచ్ లలో ఇండియా 5 టెస్టులు, 3 వన్డేలు, 8 టీ20లు ఆడబోతుంది. ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుండగా, దీంతోనే ఇండియా హోమ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు ముందు ముందు ఆస్ట్రేలియాతో ఈ మూడు వన్డేలు జరుగుతాయి. ఇక వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మళ్లీ ఆసీస్ తో ఐదు టీ20ల సిరీస్ జరరగనుంది. ఈ టీ20 సిరీస్ నవంబర్ 23న వైజాగ్ లో ప్రారంభం కానుంది.. డిసెంబర్ 3న హైదరాబాద్ లో ముగుస్తుంది. ఇక వచ్చే ఏడాది 2024 ప్రారంభంలో ఆఫ్ఘనిస్థాన్ తో ఇండియా హోమ్ సిరీస్ ఆడనుండగా, ఆ జట్టు తొలిసారి వైట్ బాల్ టోర్నమెంట్ కోసం ఇండియాకి రాబోతుంది.
ఆఫ్ఘన్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.. ఈ సిరీస్ జనవరి 25, 2024 నుంచి మొదలు కానుంది. ఐదు టెస్టుల్లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుండటం విశేషం. తర్వాతి మ్యాచ్‌లు వైజాగ్, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలల్లో జరుగుతాయి.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ షెడ్యూల్:
తొలి వన్డే – సెప్టెంబర్ 22 (మొహాలీ)
రెండో వన్డే – సెప్టెంబర్ 24 (ఇండోర్)
మూడో వన్డే – సెప్టెంబర్ 27 (రాజ్‌కోట్)
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ షెడ్యూల్:
తొలి టీ20 – నవంబర్ 23 (వైజాగ్)
రెండో టీ20 – నవంబర్ 26 (తిరువనంతపురం)
మూడో టీ20 – నవంబర్ 28 (గువాహటి)
నాలుగో టీ20 – డిసెంబర్ 1 (నాగ్‌పూర్)
ఐదో టీ20 – డిసెంబర్ 3 (హైదరాబాద్)
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల జాబితా:
తొలి టెస్ట్ – జనవరి 25 నుంచి 29 (హైదరాబాద్)
రెండో టెస్ట్ – ఫిబ్రవరి 2 నుంచి 6 (వైజాగ్)
మూడో టెస్ట్ – ఫిబ్రవరి 16 నుంచి 20 (రాజ్‌కోట్)
నాలుగో టెస్ట్ – ఫిబ్రవరి 23 నుంచి 27 (రాంచీ)
ఐదో టెస్ట్ – మార్చి 7 నుంచి 11 (ధర్మశాల)