ICC Rankings | ఐసీసీ ర్యాక్సింగ్స్.. అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా టీమిండియా
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. విధాత: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా ర్యాకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలిటెస్టులో ఇన్సింగ్స్ 132 పరుగులతో విజయం సాధించిన భారత్.. ర్యాక్సింగ్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఐసీసీ మూడు ఫార్మాట్లలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటికే వన్డే, టీ20లో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. ఇంతకు ముందు 2014లో […]

- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.
విధాత: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా ర్యాకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన తొలిటెస్టులో ఇన్సింగ్స్ 132 పరుగులతో విజయం సాధించిన భారత్.. ర్యాక్సింగ్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం ఐసీసీ మూడు ఫార్మాట్లలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటికే వన్డే, టీ20లో భారత్ అగ్రస్థానంలో ఉన్నది.
ఇంతకు ముందు 2014లో దక్షిణాఫ్రికా ఒకేసారి మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగింది. ఆస్ట్రేలియాపై భారీ విజయం తర్వాత రోహిత్ సేన 115 పాయింట్లు సాధించింది. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కంటే నాలుగు పాయింట్లు భారత్ ఆధిక్యంలో ఉన్నది. ఇంగ్లండ్ జట్టు మూడో స్థానంలో ఉన్నది. ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడనున్నది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ అనంతరం భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ర్యాక్సింగ్ సైతం మెరుగయ్యాయి.
బౌలర్ల ర్యాంకింగ్‌లో అశ్విన్ రెండోస్థానానికి, జడేజా 16వ స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో స్పిన్నర్లు ఇద్దరూ కలిసి 15 వికెట్లు తీశారు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. బౌలర్లలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, అశ్విన్ 21 పాయింట్ల తేడాతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్ శర్మ 786 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. నాగ్‌పూర్ టెస్టుకు మంది పదో స్థానంలో రోహిత్.. సెంచరీతో రెండు స్థానాలను మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.