Gaddar | ఐసీయూలోనూ పాట‌లు పాడిన గ‌ద్ద‌ర్.. చివ‌రి 12 గంట‌ల్లో ఏం జ‌రిగింది..?

Gaddar | ప్ర‌జా గాయ‌కుడు, ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ చివ‌రి క్ష‌ణాల్లోనూ పాట‌లు పాడిన‌ట్లు ఆయ‌న అల్లుడు శ్రీకాంత్ తెలిపారు. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతూ కూడా.. పాట‌పై త‌న‌కున్న అభిమానాన్ని గ‌ద్ద‌ర్ చాటుకున్నారు. చివ‌రి క్ష‌ణాల్లోనూ ఆయ‌న ప‌లు పాట‌లు ఆల‌పించి.. క‌న్నుమూశారు. 12 రోజుల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం అపోలో ఆస్పత్రిలో గద్దర్ చేరారని ఆయన అల్లుడు శ్రీకాంత్ తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనూ గద్దర్ పాటలు పాడారని ఆయన తెలిపారు. […]

Gaddar | ఐసీయూలోనూ పాట‌లు పాడిన గ‌ద్ద‌ర్.. చివ‌రి 12 గంట‌ల్లో ఏం జ‌రిగింది..?

Gaddar | ప్ర‌జా గాయ‌కుడు, ప్ర‌జా యుద్ధ‌నౌక గ‌ద్ద‌ర్ చివ‌రి క్ష‌ణాల్లోనూ పాట‌లు పాడిన‌ట్లు ఆయ‌న అల్లుడు శ్రీకాంత్ తెలిపారు. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతూ కూడా.. పాట‌పై త‌న‌కున్న అభిమానాన్ని గ‌ద్ద‌ర్ చాటుకున్నారు. చివ‌రి క్ష‌ణాల్లోనూ ఆయ‌న ప‌లు పాట‌లు ఆల‌పించి.. క‌న్నుమూశారు.

12 రోజుల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ నిమిత్తం అపోలో ఆస్పత్రిలో గద్దర్ చేరారని ఆయన అల్లుడు శ్రీకాంత్ తెలిపారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనూ గద్దర్ పాటలు పాడారని ఆయన తెలిపారు. ఆయన మరణం తమను తీవ్ర విషాదంలోకి నెట్టిందని తెలిపారు.

గ‌ద్ద‌ర్ మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాల‌ను అపోలో ఆస్ప‌త్రి వైద్యులు వివ‌రించారు. గుండె ఆప‌రేష‌న్ త‌ర్వాత గ‌ద్ద‌ర్ కోలుకున్నారు. అయితే ఆదివారం తెల్ల‌వారుజామున గ‌ద్ద‌ర్‌కు ఒక్క‌సారిగా బీపీ పెరిగింది. దాన్ని కంట్రోల్ చేసే స‌మ‌యంలోనే ఆయ‌న షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయి.

ఓ వైపు బీపీ పెర‌గ‌డం, మ‌రో వైపు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గ‌డంతో చికిత్స‌కు స్పందించ‌డం క‌ష్టంగా మారింది. గద్దర శరీరంలోని అవయవాలు చికిత్సకు స్పందించడం మానేశాయని తెలిపారు. కిడ్నీ, లివర్ పని చేయడం మందగించడంతో చివరి 12 గంటల్లోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో ఆదివారం మధ్యాహ్నం గద్దర్ తుది శ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

కాగా, గద్దర్ మరణ వార్త తెలియడంతో వందలాది మంది అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఉద్యమ, ప్రజా సంఘాల నేతలు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని గద్దర్‌కు జోహార్లు అర్పించారు.