హై కోర్టులో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేసు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన కేసు విచారణ హైకోర్టులో మంగళవారం కొనసాగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కొత్తగా నియామితులైన వారిపై కేసు

హై కోర్టులో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేసు

మధ్యాహ్నాంకు వాయిదా

విధాత : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన కేసు విచారణ హైకోర్టులో మంగళవారం కొనసాగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కొత్తగా నియామితులైన వారిపై కేసు తేలే వరకు స్టే విధించాలని పిటిషన్లు దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ వివాదంపై ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు విచారణను మధ్యాహ్నంకు వాయిదా వేసింది. తిరిగి లంచ్ తర్వాత కోర్టు మళ్లీ వాదనలు విననుంది. గత బీఆరెస్ ప్రభుత్వ హాయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనలను నిబంధనల మేరకు లేవంటూ గవర్నర్ తమిళి సై తిరస్కరించారు.


గవర్నర్ నిర్ణయాన్ని శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్‌ను, సియాసత్ ఎడిటర్ మీర్ అమీరుల్లాఖాన్‌ను ఎంపిక చేయగా, ఈ ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు. ఇప్పుడు హైకోర్టును శ్రవణ్‌, సత్యనారాయణలు కోరినట్లుగా తమ కేసు తేలేవరకు కొత్తగా నియామితులైన కోదండరామ్‌, అమీరుల్లాఖాన్‌ల నియామకాలపై స్టే విధించాలన్న అభ్యర్థనను హైకోర్టు అంగీకరిస్తే మాత్రం రాజకీయంగా, న్యాయపరంగా ఈ వివాదం మరో మలుపు తిరగనుంది.