లేఅవుట్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం
లే అవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్ )పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది

విధాత : లే అవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్ )పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకుంది. గతంలో ఎల్ ఆర్ ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్త దరఖాస్తుదారులకు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్స్ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల మంది దరఖాస్తుదారులకు లాభం చేకూరనున్నది.