పాఠశాలలకు 2 రోజుల సెలవులు

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు ఈనెల 29, 30 తేదీల్లో రెండు రోజుల వరుస సెలవులు ప్రకటించింది

పాఠశాలలకు 2 రోజుల సెలవులు
  • పోలింగ్ కు ముందు రోజే ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు
  • ప్రభుత్వ పాఠశాలల్లోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
  • ఈ నేపథ్యంలోనే 29, 30 తేదీల్లో సెలవులకు విద్యాశాఖ ప్రకటన


విధాత: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు ఈనెల 29, 30 తేదీల్లో రెండు రోజుల వరుస సెలవులు ప్రకటించింది. ఈనెల 30న తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు 80 శాతం మంది ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌నున్నారు. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే ఎన్నికల పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.


ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌నున్న ఉపాధ్యాయులు 29వ తేదీ ఉద‌యం 7 గంట‌ల‌లోపే ఈవీఎంల‌ను తీసుకునేందుకు సంబంధిత కార్యాల‌యాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉపాధాయులు ఎన్నికల విధుల్లో ఉండడం, ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈ నేప‌థ్యంలోనే 29, 30 తేదీల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ప్రకటించారు. తిరిగి డిసెంబ‌ర్ 1న పాఠశాలలు తెరుచుకొనున్నాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ సూచ‌న మేర‌కు విద్యాశాఖ‌ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.