Khammam: తెలంగాణ ఉద్యమం.. ఖమ్మం నుంచే ప్రారంభమైంది: రేవంత్ రెడ్డి
Khammam 9 ఏళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు నాపై ఇప్పటికే 130 కేసులు పెట్టించారు, ఇంతకంటే ఏం చేయగలరు పంపకాల్లో తేడాతోనే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం బయటకు వచ్చింది అంగట్లో దొరుకుతున్న పదవ తరగతి ప్రశ్నా పత్రాలు ఖమ్మంలో 10 సీట్లు ఇస్తే రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తీసుకువస్తా కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శనలో రేవంత్ రెడ్డి విధాత బ్యూరో, ఖమ్మం: రాష్ట్రంలో 50 లక్షల మంది […]

Khammam
- 9 ఏళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు
- నాపై ఇప్పటికే 130 కేసులు పెట్టించారు, ఇంతకంటే ఏం చేయగలరు
- పంపకాల్లో తేడాతోనే టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం బయటకు వచ్చింది
- అంగట్లో దొరుకుతున్న పదవ తరగతి ప్రశ్నా పత్రాలు
- ఖమ్మంలో 10 సీట్లు ఇస్తే రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తీసుకువస్తా
- కాంగ్రెస్ విద్యార్థి నిరుద్యోగ నిరసన ప్రదర్శనలో రేవంత్ రెడ్డి
విధాత బ్యూరో, ఖమ్మం: రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి, నిరుద్యోగ నిరసన ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘మా ఉద్యోగాలు మాకే కావాలి’ అనే నినాదంతో 1969 లో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే
మొదలైన విషయాన్ని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ట్యాగ్ లైన్ తో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిన ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు పాలనలో 9 ఏళ్ళు గడిచినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చింది లేదన్నారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగింది లేదన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో లక్షా ఏడువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని శాసనసభ సాక్షిగా కెసిఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. తెలంగాణ నిరుద్యోగులు, మేధావులు,
అమరుల కుటుంబాలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.
ఇటీవల కాలంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే, ముఖ్యమంత్రి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందేమోనని తాము భావించామని, చివరకు జరిగిందేమిటో ప్రజలందరికీ తెలిసిందే అన్నారు.
రాష్ట్రంలో 10వ తరగతి ప్రశ్నా పత్రాలు బజారులో దొరుకుతున్నాయి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కృష్ణ పత్రాలు లీక్ అయ్యాయి.. వీటన్నింటిని చూస్తే నిరుద్యోగులు విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్న విషయం అర్థం అవుతుందన్నారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పంపకాల్లో తేడాలు రావడం వల్లే అసలు విషయం బయటపడిందని, ఇదే విషయమై తాము నిలదీస్తే విచారణ అధికారులు దోషులను వదిలి తమకు నోటీసులు ఇచ్చారని చెప్పారు.
లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తే, ముఖ్యమంత్రి తనకు నోటీసులు పంపి సంతృప్తి చెందారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై ఇప్పటికే 130 కేసులు పెట్టించారని, ఇంతకన్నా ఆయన ఏం చేయగలరని ప్రశ్నించారు.
మే మొదటి వారంలో హైదరాబాదులో జరిగే నిరుద్యోగ నిరసన సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు కాంగ్రెస్‌కు కట్టబెడితే, రాష్ట్రంలో నూటికి 90 సీట్లు తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.
ఖమ్మం నిరుద్యోగ నిరసన ర్యాలీ….
కెసిఆర్ 8 సంవత్సరాల పరిపాలనలో అసువులుబాసిన విద్యార్థి, నిరుద్యోగ అమరవీరులకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తో కలిసి నివాళులు అర్పించారు.