ప్రియాంక గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు.. త్వరలో సమీక్ష
వెల్లడించిన ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ విధాత: ప‌్రియాంక గాంధీ త్వరలో తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ వెల్లడించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ డెవలప్‌మెంట్- తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికను సీరియస్ గానే తీసుకొని పనిచేసిందన్నారు. […]

వెల్లడించిన ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ
విధాత: ప‌్రియాంక గాంధీ త్వరలో తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు తీసుకుంటారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ వెల్లడించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ డెవలప్‌మెంట్- తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సమీక్షలే కాదు దిద్దుబాటు చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.
శుక్రవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికను సీరియస్ గానే తీసుకొని పనిచేసిందన్నారు. ఎన్నికల్లో నాయకులందరూకలిసి పని చేశారని తెలిపారు. అయితే ఉప ఎన్నికల్లో కంటిన్యూ గా ఓడిపోవడం విచారకరమన్నారు.
అందరం కలిసి కట్టుగా పని చేసినా తెలంగాణలో ప్రజల మద్దతు ఎందుకు రావడం లేదు అనే దానిపై సమీక్ష చేయాలన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ జొడో యాత్రలో నాయకుల ఐక్యత కనపడింది.. ఇది మంచి పరిణామమని అన్నారు. ఒకప్పడు కమ్యూనిస్టులు మాతో ఉండే.. కానీ ఇప్పుడు లేరన్నారు. పార్టీ క్రమశిక్షణ కి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు.