తెలంగాణ ఓటర్లు 3,30,37,133
పార్లమెంటు ఎన్నికలకు ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది

విధాత: పార్లమెంటు ఎన్నికలకు ఓటర్లకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. దానిని గురువారం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,30, 37,133 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,64,47,132, మహిళలు 1,65,87,244, థర్డ్ జండర్ 2737, సర్వీస్ ఓటర్లు 15,376, ఎన్ ఆ ర్ ఐ ఓటర్లు 3,399 ఉన్నట్లు పేర్కొన్నది. ఇందులో 7,19,104 ఓట్లు కొత్తగా చేర్చారు. 5,26,867 ఓట్లు తొలగించారు. 4,21,521 ఓట్లలో కరెక్షన్స్ చేశామని ఎన్నికల సంఘం తెలిపింది. 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన ఓటర్లు 754 నుంచి 791కి పెరిగారని, 80 ఏళ్ల పైబడిన ఓటర్లు 4,54,230 ఉండగా, దివ్యాంగుల ఓటర్లు 5,28,405 ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఈ మేరకు సీఈవో వికాస్ రాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు.